Home తాజా వార్తలు ‘బ్రూస్‌లీ’ పాటల సందడి

‘బ్రూస్‌లీ’ పాటల సందడి

charanమెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ‘బ్రూస్‌లీ’తో తమన్ మరో మ్యూజికల్ హిట్ కొట్టాడు. ఇటీవల విడుదలైన సినిమా పాట లు అన్ని మ్యూజికల్ చార్ట్‌లలో టాప్‌గా నిలిచాయి. పాటలేకాదు సినిమాలో రామ్‌చరణ్ డ్యాన్స్, పాటలు చిత్రీకరిం చిన అందమైన లొకేషన్లు హైలైట్‌గా నిలువనున్నాయి. ఇప్పటికే యూట్యూబ్‌లో ‘బ్రూస్‌లీ’ ట్రైలర్ బిగ్ హిట్‌గా నిలిచింది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా వచ్చే నెల నుంచి రామ్‌చరణ్ రెండు సినిమాలతో బిజీగా మారనున్నాడు. తను హీరోగా చేయబోయే కొత్త సినిమాతో పాటు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా నిర్మాతగా ఆయన బిజీ కాబోతున్నాడు. తమిళ్‌లో హిట్ అయిన ‘తని ఒరువన్’ సినిమా రీమేక్‌లో నటించేందుకు ఇటీవలే చరణ్ సైన్ చేశాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్క నుంది. వచ్చే నెల ఈ సినిమా ప్రారంభమై రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి మొదలవుతుంది. డివివి దానయ్య, ఎన్‌వి ప్రసాద్‌లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు.