బెంగళూరు: బలపరీక్షకు సమయం దగ్గరపడుతున్న కొద్ది కర్నాటక రాజకీయ సమీకరణాలు క్షణక్షణం మారిపోతున్నాయి. తాజాగా అక్కడి జాతీయ మీడియాలో వెలువడుతున్న సమాచారం ప్రకారం… సభలో బలం నిరూపించుకోలేని పరిస్థితి ఎదురైతే యడ్యూరప్ప అంతకుముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారని వదంతులు వినిపిస్తున్నాయి. బలపరీక్ష కంటే ముందే యడ్డీ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందు సభలో మాట్లాడి యడ్యూరప్ప గవర్నర్ వాజుభాయ్ వాలాను కలుస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప తన రాజీనామా లేఖను సిద్ధం చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.