Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

34,000 దిగువకు బిఎస్‌ఇ సెన్సెక్స్

bsns1

 పిఎన్‌బి షేర్‌లు 8 శాతం పతనం
 నిఫ్టీ సైతం 73.90 పాయింట్లు డౌన్

ముంబయి: బిఎస్‌ఇ సెన్సెక్స్ సోమవారం నాడు 34,000 మార్క్ దిగువకు పడిపోయింది. 236 పాయింట్లు పతనం చెందిన గత రెండు నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువగా 33,774.66 వద్ద ముగిసింది. పిఎస్‌యు, మెటల్, బ్యాంకింగ్ కౌంటర్ల వద్ద నిలకడగా అమ్మకాలు సాగాయి. మదుపరుల సెంట్‌మెంట్‌లో పిఎన్‌బి మోసం భారీ ఎత్తున ప్రతిఫలించింది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తిరిగి పుంజుకోవడం వల్ల ద్రవ్య లోటుపై విరుద్ధ ప్రభావం వుండగలదని భయాలు తిరిగి నెలకొన్న నేపథ్యంలో మార్కెట్ భాగస్వాములు మరింత జాగ్రత్తగా వ్యవహరించారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు షేర్‌ల విలువ 8 శాతం పడిపోయింది. వరుసగా నాల్గవ సెషన్‌కు ఈ పతనం పాకింది. నీరవ్ మోడీ మోసం బయటపడ్డాక 4వరుస సెషన్లలో స్టాక్ సుమారు 31 శాతం పతనం అయింది. 30 షేర్ సెన్సెక్స్ బారో మీటర్ ఇంతకు ముందు సెషన్‌లో 286.71 పాయింట్లు శుక్రవారం నాడు కోల్పోయింది. ఇది 0.69 శాతం. అది 33,554.37 పాయింట్లను రోజంతా వ్యాపారంలో తాకింది. చివరకు 33,774.66 వద్ద ముగిసింది. గత ఏడాది డిసెంబర్ 31 తర్వాత ఇది అత్యంత బలహీనమైన క్లోజింగ్. అప్పుడు అది 33,756.20 వద్ద క్లోజయింది.బ్రాడర్ నిఫ్టీ కూడా తక్కువగా 73.90 పాయింట్లు లేదా 0.71 శాతం తగ్గి 10,378.40 వద్ద ముగిసింది. సెషన్ అంతటా అది నెగటివ్ ధోరణి చూపించింది. అతి తక్కువగా 10,302.75 పాయింట్లను తాకింది. ఇదిలా ఉండగా ఫారెన్ పోర్ట్‌పోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పిఐలు) దేశీయ షేర్‌ల అమ్మకం కొనసాగించాయి. నికరంగా  రూ. 1065.99 కోట్ల విలువ షేర్‌లను అవి అమ్మాయి. దేశీయ సంస్థాగత మదుపరులు (డిఐఐలు) రూ. 1,127.28 కోట్ల మేర శుక్రవారం కొనుగోళ్లు సాగించాయని తాత్కాలిక సమాచారం తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ తీరులో ఆసియా ప్రాంతంలో జపాన్ నిక్కీ విలువ 1.33 శాతం పెరిగింది. హాంకాంగ్, చైనాలో సోమవారం మార్కెట్‌లు ప్రభుత్వ సెలవు దినం కావడంతో మూతపడి ఉన్నాయి. యూరోపియన్ మార్కెట్‌లు ఆరంభ వ్యాపారం హెచ్చుగా సాగించాయి.

Comments

comments