Home తాజా వార్తలు భార్యాపిల్లలను చంపి.. జవాన్ ఆత్మహత్య

భార్యాపిల్లలను చంపి.. జవాన్ ఆత్మహత్య

BSF Jawan Commits Suicide after shoots dead family members in Tripura

అగర్తలా: బిఎస్‌ఎఫ్ జవాన్ తన భార్యాపిల్లలను చంపి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన త్రిపుర రాజధాని అగర్తలోని సుభాష్‌నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది.  త్రిపుర స్టేట్ రైఫిల్స్‌లో పనిచేస్తున్న జవాన్ మానిక్ లాల్ ఘోష్ తన ఇద్దరు పిల్లలతో పాటు భార్యను హతమార్చి ఆ తరువాత తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే జవాన్ ఎందుకు ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై త్రిపుర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.