Home జాతీయ వార్తలు పని ఒత్తిడిని తట్టుకోలేక … జవాను ఆత్మహత్య

పని ఒత్తిడిని తట్టుకోలేక … జవాను ఆత్మహత్య

BSF Jawanత్రిపుర : : ఎన్నికల విధుల్లో ఉన్న ఓ జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన  ధలై జిల్లాలో జరిగింది. తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సదరు జవాను ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే జవాన్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ జవాను మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడిని జమ్మూకశ్మీర్‌కు చెందిన అశ్విని కుమార్(50)గా పోలీసులు గుర్తించారు.  బిఎస్‌ఎఫ్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా ఆశ్విని కుమార్ పని చేస్తున్నారు. పని ఒత్తిడిని తట్టుకోలేకనే అశ్విని కుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శవ పరీక్ష కోసం అశ్విని కుమార్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.

BSF Jawan Commits Suicide At Tripura