Home జాతీయ వార్తలు పాక్ కాల్పుల్లో బిఎస్‌ఎఫ్ జవాను మృతి

పాక్ కాల్పుల్లో బిఎస్‌ఎఫ్ జవాను మృతి

BSf Jawansజమ్మూకశ్మీర్: దాయాది పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. గత వారం రోజుల నుంచి భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దులో భారత బలగాలకు, పాక్ రేంజర్ల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఆర్‌ఎస్ పురా సెక్టార్‌లో సోమవారం తెల్లవారుజామున పాక్ జరిపిన కాల్పుల్లో బిఎస్‌ఎఫ్ జవాను సుశీల్ కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. మరో జవానుతో పాటు ఓ పౌరుడు కూడా తీవ్రంగా గాయపడ్డారు.