Home అంతర్జాతీయ వార్తలు పాక్ కాల్పుల్లో బిఎస్‌ఎఫ్ జవాను మృతి

పాక్ కాల్పుల్లో బిఎస్‌ఎఫ్ జవాను మృతి

BSF Jawan Shot Deadశ్రీనగర్ : పాకిస్థాన్ రేంజర్లు మాటిమాటికి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నారు. జమ్మూకశ్మీర్ హీరానగర్ సెక్టార్‌లోని కతువాలో బుధవారం ఉదయం పాక్ రేంజర్లు భారత జవాన్లపై కాల్పులు జరిపారు. మోర్టార్ షెల్స్‌తో దాడి చేశారు. ఈ దాడుల్లో ఓ జవాను తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన జవాను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన జవాన్‌ను వినయ్ ప్రసాద్‌గా బిఎస్‌ఎఫ్ అధికారులు గుర్తించారు. సోమవారం రాత్రి నుంచి పాక్ రేంజర్లు భారత సైన్యంపై కాల్పులు జరుపుతూనే ఉన్నారు. భారత సైన్యం పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు.

BSF Jawan Shot Dead