Home తాజా వార్తలు రిటైర్మెంట్ కోరిన జవాను : తిరస్కరించిన బిఎస్‌ఎఫ్

రిటైర్మెంట్ కోరిన జవాను : తిరస్కరించిన బిఎస్‌ఎఫ్

tej-bahadur-yadavన్యూఢిల్లీ : దేశ సరిహద్దులో జవాన్లకు నాసిరకమైన భోజనం పెడుతున్నారని చెప్తూ ఫేస్‌బుక్‌లో బిఎస్‌ఎఫ్ జవాను తేజ్‌బహదుర్ యాదవ్ పోస్ట్ చేసిన వీడియో ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. కాగా తేజ్‌బహదూర్ తాజాగా స్వచ్ఛంద పదవీ విరణ (విఆర్‌ఎస్) కోరారు. ఆయన విఆర్‌ఎస్ పిటిషన్‌ను బిఎస్‌ఎఫ్ తిరస్కరించింది. తేజ్‌బహదూర్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ, ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అంశంపై విచారణ పెండింగ్ లో ఉన్నందుకు ఈ పిటిషన్‌ను తిరస్కరించినట్లు బిఎస్‌ఎఫ్ తెలిపింది. ఈ విషయం జవానులు జనవరి 30వ తేదీనే తెలియజేసినట్లు తెలిపింది.

మరోవైపు తేజ్‌బహదూర్‌ను బాగా బెదిరించారని, మానసికంగా వేధిస్తున్నారని ఆయన కుటుంబం ఆరోపిస్తుంది. తేజ్‌బహదూర్ ఈ రోజు ఉదయం తనకు ఫోన్ చేసినందుకు తనను అరెస్ట్ చేసి, వేధిస్తున్నారని ఆయన భార్య ఆరోపించారు. కాగా బిఎస్‌ఎఫ్ మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తేజ్‌బహదూర్‌ను అరెస్ట్ చేయలేదని బిఎస్‌ఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.