Home జాతీయ వార్తలు బిఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్‌ట్రా టాక్ టైం

బిఎస్‌ఎన్‌ఎల్ ఎక్స్‌ట్రా టాక్ టైం

BSNLమన తెలంగాణ / హైదరాబాద్: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ తాజాగా తన టాప్ అప్ కార్డులపై ఎక్స్‌ట్రా టాక్ టైం ఆఫర్లను ప్రకటించింది. 2015 సంవత్సరం ముగుస్తున్న తరుణంలో ఈ ఆఫర్లను ప్రకటించడం వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. టాపప్ డినామినేషన్ రూ. 5000 కార్డుకు గాను టాక్ టైం రూ. 6000, టాప్ అప్ 3000లకు గాను, టాక్ టైం ఆఫర్ రూ. 3450, అలాగే టాపప్ రూ.2000లకు గాను రూ.2300, టాపప్ రూ. 890కి గాను రూ. 1000, టాపప్ రూ. 390కి గాను, టాక్ టై రూ. 433, టాప్ అప్ 290కి గాను టాక్ టైం ఆఫర్‌ను రూ. 320గా నిర్ణయించింది. ఈ ఆఫర్లు తక్షణమే అమలులోకి వచ్చి జనవరి 2వ తేదీతో గడువు ముగిస్తామని, మరిన్ని వివరాలకు కష్టమర్ కేర్ 1503కి డయల్ చేయవచ్చని బిఎస్‌ఎన్‌ఎల్ వెల్లడించింది.