Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

‘బిఎస్‌ఎన్‌ఎల్ చౌక 444’ ఆఫర్…

BSNL

ముంబయి: రిలయన్స్ జియో ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటించడంతో టెలికాం రంగంలో ప్రస్తుతం విపరీతమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. దాంతో మిగతా నెట్‌వర్క్‌లు తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. వినియోగదారులకు తక్కువ డేటా రేట్లతో ఆకర్శించే పనిలోపడ్డాయి. ఇప్పటి వరకు ఐడియా, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌తో పాటు ఇతర నెట్‌వర్క్‌లు కూడా కొత్త కొత్త ఆఫర్లు ప్రకటించాయి.

తాజాగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ తమ ప్రీపెడ్ కస్టమర్ల కోసం కొత్త 3జి మొబైల్ డేటా ప్లాన్‌ను తీసుకువచ్చింది. బిఎస్‌ఎన్‌ఎల్ చౌక 444 పేరిట, రూ. 444 పెట్టి రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 4జిబి డేటా… 90 రోజుల పాటు వాడుకోవచ్చు. అంతకుముందు ప్రకటించిన ఎస్‌టివి 333 అకా ఎస్ ఆఫర్‌కు అనుహ్యంగా మంచి స్పందన రావడంతో తాజాగా ఈ ఎస్‌టివి 444 ప్లాన్‌ను బిఎస్‌ఎన్‌ఎల్ ప్రకటించింది.

BSNL Chaukka – 444: BSNL Offers 4 GB Data Per Day At Rs. 444

Comments

comments