Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

కొత్త వినియోగదారులకు 80 శాతం కాల్ రేటు తగ్గింపు

BSNLబిఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఆఫర్
రెండు నెలల వరకే ఈ పథకం
ఒక సెకన్, ఒక నిమిషం ప్లాన్‌లు

న్యూఢిల్లీ: ఆఫర్లనతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ కూడా ప్రయత్నం చేస్తోంది. తాజాగా కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు బిఎస్ ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త కస్టమర్లకు తొలి రెండు నెలల వరకు 80 శాతం కాల్ రేటును తగ్గించనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత తరుణం లో మార్కెట్‌లో ఇతర నెట్‌వర్క్‌ల పోటీని దృష్టిలో ఉంచుకుని బీఎస్‌ఎన్‌ఎల్ అడు గులు వేస్తోంది. దీనిలో భాగంగానే ఒక నిమిషం, ఒక సెకన్ బిల్లిం గ్ ప్లాన్ వంటి కొత్త ఆపర్లతో వినియోగదారుల ముందుకు వస్తోంది. అదే సమయంలో బిఎస్‌ఎన్ ఎల్ ఇటీవల మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపరచుకుంది. అందుకే కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు 80 శాతం కాల్ రేటు తగ్గింపు ఆఫర్‌ను ప్రకటిం చిందని బిఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ తెలిపారు. అయితే కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులు రెండు ఆఫర్లను ఇస్తోంది.

కొత్త కనెక్షన్ కోసం సెకండ్ ప్లాన్‌కు రూ.36 వోచర్, నిమిషం ప్లాన్‌కు రూ.37 వోచర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుం దని సంస్థ వెల్లడించింది. రూ.37 తో రిచార్జ్ చేసు కున్నట్ల యితే వారికి నిమిషానికి 10 పైసల చొప్పున చార్జ్ చేయబడుతుందని తెలిపింది. కొత్త వినియోగదారులు తమ సేవలను పునరుద్ధరిం చుకోవడానికి ఇది మంచి అవకాశమని శ్రీవాత్సవ తెలిపారు. కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదా రులకు మొదటిసారి ఒక సెకన్ ప్లాన్ కోసం తొలు త రూ. 36 వోచర్, ఒక నిమిషం ప్లాన్ కో సం రూ. 37 వోచర్‌తో రిచార్జ్ చేసుకోవాలి. మొబై ల్ నంబర్ పోర్టబులుటీ వినియోగదారులు కూడా ఈ ప్లాన్‌లు వర్తిస్తాయని సంస్థ తెలిపింది. రూ.36 రీచార్జ్ చేసుకున్న తర్వాత బిఎస్‌ఎన్‌ఎల్‌లో లోక ల్, ఎస్‌టిడికి ప్రతి మూడు నిమిషాలకు ఒక పైస లు, ఇతర నెట్‌వర్క్‌లకు 3 సెకండ్‌లకు 2 పైసలు పడుతుంది.

Comments

comments