Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

4జి వోల్ట్ సేవల కోసం నోకియాతో బిఎస్‌ఎన్‌ఎల్ ఒప్పందం

bsnl

న్యూఢిల్లీ: 4జి వోల్ట్(వాయిస్ ఓవర్ ఎల్‌టిఇ) సేవలను ప్రారంబించేందుకు నోకియాతో ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ ఒప్పందం చేసుకుంది. ఈశాన్య, దక్షిణ భారతీయ ప్రాంతాల్లో వోల్ట్ సేవలను ప్రారంభించేందుకు బిఎస్‌ఎల్‌ఎల్ ప్రయత్నిస్తోంది. దీని భాగంగానే ఇరు సంస్థలు నెట్‌వర్క్ ఆధునీకరణ ఒప్పందం చేసుకున్నాయని అధికారులు తెలిపారు. నోకియా భారత్‌లోని 10 టెలికాం సర్కిళ్లలో తన టెక్నాలజీని వినియోగిస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్, గోవా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. అందుబాటులో ఉన్న అత్యాధునిక సేవలను వినియోగించుకొని బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందజేస్తుందని సంస్థ ఛైర్మన్, ఎండి అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. నోకియాకు చెందిన సింగిల్ రేడియో యాక్సెస్ నెట్‌వర్క్‌ను వినియోగించుకొని 2జి, 3జి, 4జి వినియోగదారులకు చౌకగా సేవలను అందిస్తామని ఆయన చెప్పారు. అలాగే విఒఎల్‌టిఇ టెక్నాలజీని వినియోగించుకొని 4జి వినియోగదారులకు హెచ్‌డి క్వాలిటీ వాయిస్ సేవలను అందజేస్తుంది. 2017లో నోకియా, బిఎస్‌ఎన్‌ఎల్‌లు మరో ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ప్రకారం భారత్‌లో 5జి సేవలకు అవసరమైన టెక్నాలజీని అభివృద్ధి చేయాలని నిర్ణయించాయని ఆయన వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం భారతీ ఎయిర్‌టెల్, హువాయి కంపెనీలు కలిసి 5జి నెట్‌వర్క్ సేవలను ట్రయల్ చేపట్టాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ పరీక్షలు నిర్వహించాయి.

Comments

comments