Search
Saturday 17 November 2018
  • :
  • :

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.339 రీచార్జి ఆఫర్

BSNL-Offer

న్యూఢిల్లీ: జియోతో పోటీ నేపథ్యంలో ప్రభుత్వం టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ మరో సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ప్రతిరోజూ 2 జిబి 3జి డేటా, నెట్‌వర్క్ పరిధిలో అపరిమిత కాల్స్‌ను అందిస్తోంది. అలాగే ఇతర నెట్‌వర్క్‌లకు మాట్లాడేందుకు రోజుకు 25 నిమిషాలు ఉచితంగా అందించనుంది. ఉచిత నిమిషాలు అయిన తరువాత మాట్లాడే ప్రతి కాల్‌కు నిమిషానికి 25పైసలు చొప్పున వసూలు చేయనుంది. రూ.339తో రీఛార్జిపై ఈ సదుపాయాలను పొందొచ్చు. 28 రోజుల కాలపరిమితిపై ఈ ప్యాక్‌ను అందిస్తున్నట్లు ఓ ప్రకటనలో బిఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. రిలయన్స్ జియో పోటీని తట్టుకునేందుకు టెలికాం సంస్థలు వినియోగదారులను ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్, ఐడియా సంస్థలు పలు ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. టెలికామ్ సంస్థ ఐడియా కూడా వినియోగదారులకు  బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెలకు 1 జిబి డాటాను  ఆరు నెలలపాటు ఉచితంగా అందించనుంది. ఈ మేరకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీదారీ సంస్థ ఐటెల్‌తో  భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఆఫర్ ఐటెల్‌కు సంబంధించిన ఎంపిక చేసిన కొన్ని స్మార్ట్ ఫోన్ మోడల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌లో మొదటి నెల డాటా పూర్తిగా ఉచితం.. ఆ తర్వాత ఆరునెలలు వరుసగా నెలలు 1జిబి డాటా ఉచితంగా పొందుతారు.

Comments

comments