Search
Sunday 23 September 2018
  • :
  • :

బిఎస్‌ఎన్‌ఎల్ కాల్ ఛార్జీలు పెంపు!

BSNLప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్‌ఎన్‌ఎల్) వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇంట్రా-నెట్‌వర్క్ లోకల్ ఛార్జీలను ఒక్కసారిగా పెంచేసింది. లోకల్ ఛార్జీలను 20 శాతం పెంచుతున్నట్టు బిఎస్‌ఎన్‌ఎల్ అధికార ప్రతినిధి తెలిపారు. దీంతో ఇక నుంచి బిఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌పై లోకల్ కాల్‌కు వసూలు చేసే ఛార్జీలు యూనిట్‌కు రూ.1.20 పైసలుగా ఉండనున్నాయి. గతంలో ఈ ఛార్జీలు రూ.1గా ఉండేవి. అంతేకాక కాల్ వ్యవధిని కూడా తగ్గించేసింది. ల్యాండ్‌లైన్ నుంచి ల్యాండ్ లైన్‌కు చేసుకొనే ప్రతి కాల్ వ్యవధి అంతకు ముందు మూడు నిమిషౠలు ఉండగా, దాన్ని ఇప్పుడు రెండు నిమిషాలకు తగ్గించింది. 2017 జనవరి బిల్లులోనే ఈ మార్పులు కనబడతాయని అధికార ప్రతినిధి చెబుతున్నారు. మరోవైపు బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు రాత్రిపూట, ఆదివారాల్లో కాల్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్న అన్‌లిమిటెడ్ కాలింగ్ నెలవారీ ఛార్జీలను కంపెనీ సగానికి తగ్గించింది. దీంతో రూ.99గా ఉన్న ఈ ఛార్జీలు రూ.49కు పడిపోయాయి.

Comments

comments