Search
Monday 16 July 2018
  • :
  • :
Latest News

‘ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీస్’ను ఆరంభించిన బిఎస్‌ఎన్‌ఎల్

bs
సిమ్ లేకుండానే ఏ నంబర్‌కైనా కాల్ చేసుకోవచ్చు
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ బుధవారం తొలిసారిగా దేశంలో ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీస్‌ను ఆరంభించింది. బిఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ యాప్ ద్వారా వినియోగదారులు ఏ టెలిఫోన్ నంబర్‌కైనా ఫోన్ చేసుకోవచ్చు. బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు కంపెనీ మొబైల్ యాప్ ‘ వింగ్స్’ ద్వారా దేశంలోని ఏ నంబరుకైనా ఫోన్‌చేయవచ్చు. దీనికి ముందు ప్రత్యేక యాప్‌ల దారానే ఫోన్ చేసుకునే వీలుండేదే తప్ప టెలిఫోన్ నంబర్లకు కాదు. ‘ ప్రస్తుత పోటీ మార్కెట్‌లో మార్కెట్ వాటాను పెంచుకోడానికి బిఎస్‌ఎన్‌ఎల్ పూనుకోవడం ప్రశంసనీయం. సిమ్ లేకుండానే ఇంటర్నెట్ టెలిఫోనీ కాల్‌ను వినియోగదారులు చేసుకోడానికి సదుపాయం కల్పించిన బిఎస్‌ఎన్‌ఎల్ మేనేజ్‌మెంట్‌కు నా అభినందనలు’ అని టెలికామ్ మంత్రి మనోజ్ సిన్హా ఈ సర్వీస్‌ను ప్రారంభించాక అన్నారు. ఈ ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీస్ ద్వారా బిఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్ దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా బిఎస్‌ఎన్‌ఎల్ వైఫై లేక ఏ ఇతర సర్వీస్ ప్రొవైడర్ ద్వారానైనా కాల్ చేసుకోవచ్చు. ఈ ఇంటర్నెట్ టెలిఫోనీ సర్వీస్ నమోదు ఈ వారం నుంచే ఆరంభమవుతాయి. అయితే యాక్టివేషన్ మాత్రం జూలై 25 నుంచి ఆరంభమవుతుంది.

Comments

comments