Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

బిఎస్‌ఎన్‌ఎల్ నూతన సంవత్సరం ఆఫర్

BSNL

హైదరాబాద్ …. బిఎస్ ఎన్‌ఎల్ బ్రాడ్ బ్యాండ్ వినియోగ దారులకు కొత్త సంవత్సరం నుండి ప్రమోషనల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగ దారులకు కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్ ఓచర్ రూ.144 ఇచ్చారు. ఈ ప్లాన్‌లో లోకల్, ఎస్‌టిడి కాల్స్ అన్ని నెట్ వర్కులకు 30 రోజుల పాటు ఉచితంగా చేసుకోవచ్చు. ప్లాన్ వ్యాలిడిటి 180 రోజులు. ఉచిత కాల్స్ తర్వాత అన్ని నెట్‌వర్క్‌లకు వాయిస్ కాల్స్ లోకల్/ ఎస్‌టిడి 80 పైసలు నిమిషానికి, ఎస్‌ఎంఎస్ 50 పైసలు, రోమింగ్‌లో ఉన్నప్పుడు లోకల్ ఎస్‌ఎంఎస్ 25 పైసలు, ఎస్‌టిడి ఎస్‌ఎంఎస్ 38 పైసలు, డాటా 10కెబికి 3 పైసలు ఛార్జి అవుతుంది. మరిన్ని వివరాలకు 1503 లేదా 1800 180 1503లో సంప్రదించాలని తెలంగాణ టెలికాం సర్కిల్ ఛీఫ్ జనరల్ మేనేజర్ ఐటిఎస్ ఎల్.అనంతరామ్ ఒక ప్రకటనలో సూచించారు.

Comments

comments