Search
Wednesday 14 November 2018
  • :
  • :

బిఎస్‌ఎన్‌ఎల్ మరో బంపర్ ఆఫర్…

BSNL

ముంబయి: రిలయన్స్ జియోకి పోటీగా ఇప్పటి వరకు వివిధ టెలీకాం సంస్థలు పలు ఆఫర్లను ప్రకటించి తమ కస్టమర్లను నిలుపుకునే ప్రయత్నం చేశాయి. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ కూడా తన బ్రాండ్‌బ్యాండ్ వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ యట్ 249 పేరిట నెలరోజుల పాటు ప్రతి రోజు 10 జిబి డాటా(2 ఎంబిపిఎస్ స్పీడ్)ను అందిస్తున్నట్లు వెల్లడించింది.

అలాగే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య ఏ నెట్‌వర్కైనా ఉచితంగా అపరిమిత కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించింది. అంతేగాక ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే ప్రతి ఆదివారం నాడు డే మొత్తం అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని తెలిపింది.

కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం ఈ ఆఫర్‌ను తీసుకువచ్చినట్లు బిఎస్‌ఎన్‌ఎల్ అధికారులు వెల్లడించారు. ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు టోల్‌ఫ్రీ నెంబర్ 18003451500ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

Comments

comments