Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

బిఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఆఫర్

BSNL

న్యూఢిల్లీ: ప్రత్యర్థి టెలికామ్ సంస్థలకు పోటీనిస్తూ ప్రభుత్వం టెలికాం రంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.149తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్‌కాల్స్‌ను(లోకల్, ఎస్‌టిడి) 30రోజుల పాటు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. అయితే ఇతర నెట్‌వర్క్‌లకు రోజుకు 30 నిమిషాలు మించి వాయిస్‌కాల్స్ చేసుకునే అవకాశం ఉండదు.

అయితే ఉచిత అపరిమితి కాల్స్ కోసం బిఎస్‌ఎన్‌ఎల్ మరో ఆఫర్‌ను ఇస్తోంది. రూ.439తో రీఛార్జ్ చేయడం ద్వారా మూడు నెలల పాటు ఉచిత వాయిస్ కాల్స్‌ను చేసుకోవచ్చు. అదనంగా 300 ఎంబి డేటాను పొందవచ్చు. తాజా పథకం జనవరి 24 నుంచి కొత్తగా బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌ను ఎంచుకునే వినియోగదారులకు వర్తిస్తుందని సంస్థ వెల్లడించింది.

Comments

comments