Home జాతీయ వార్తలు బిఎస్‌పి నేత దారుణ హత్య!

బిఎస్‌పి నేత దారుణ హత్య!

BSP leader shot dead in Delhi

న్యూఢిల్లీ: బహుజన సమాజ్ పార్టీ(బిఎస్‌పి) నేతను గుర్తు తెలియని వ్యక్తులు దేశ రాజధాని ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో తుపాకీతో కాల్చి చంపేశారు. ఈ దారుణ ఘటన సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… స్థానిక జామై నగర్‌లోని జోఘాభాయ్ ఎక్స్‌టెన్షన్‌లో బిఎస్‌పి నేత దిల్షాద్(35) నివాసముంటున్నాడు. అయితే, దిల్షాద్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి విచక్షణ రహితంగా తుపాకీతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న దిల్షాద్ ను స్థానికులు చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ దిల్షాద్ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, దిల్షాద్ యుపిలోని మీరట్ కు చెందిన బిఎస్‌పి పంచాయత్ మెంబర్ అని తెలిసింది.