Home తాజా వార్తలు నర్సింగ్ ఫలితాల విడుదల

నర్సింగ్ ఫలితాల విడుదల

BSP, Post Basic Nursing results released

 

హైదరాబాద్‌: బిఎస్‌పి నర్సింగ్, పోస్ట్ బేసిక్ నర్సింగ్ మొదటి, ద్వితీయ ఏడాది ఫలితాలను కాళోజి ఆరోగ్య విశ్వ విద్యాలయం శనివారం విడుదల చేసింది. అక్టోబర్, నవంబర్ 2018లో బిస్‌సి నర్సింగ్, పోస్ట్ బేసిక్ నర్సింగ్ మొదటతి, ద్వితీయ ఏడాడి రెగ్యలర్, రిఫర్డ్ బ్యాచ్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ఆయా పరీక్షల ఫలితాలను శనివారం యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. బిఎస్‌సి నర్సింగ్ మొదటి ఏడాది రెగ్యులర్ విద్యార్థులతో 115 డిస్టిక్షన్, 858 ఫస్ట్‌క్లాస్, 306 సెకండ్ క్లాస్ కాగా సెకండ్ ఇయర్‌లో 90 డిస్టిక్షన్, 742 ఫస్ట్‌క్లాస్, 267 సెకండ్ క్లాస్‌లో ఉత్తీర్ణులలయ్యారు. అదేవిధంగా పోస్ట్‌బేసిక్ నర్సింగ్ మొదటి ఎడాది రెగ్యులర్ విద్యార్థులలో 02 డిస్టిక్షన్, 38 ఫస్ట్‌క్లాస్, 22మంది సెకండ్ క్లాస్‌లో పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్‌లో 01 డిస్టిక్షన్, 22 మంది ఫస్ట్‌క్లాస్, 11 మంది సెకండ్ క్లాస్‌లో పాసయ్యారు. ఈ మేరకు ఫలితాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చామని , మార్కుల జాబితా సంబంధిత కళాశాలలకు పంపుతామని రిజిస్ట్రార్ ఒక ప్రకటనలో తెలిపారు.

BSP, Post Basic Nursing First, second year results released