Home తాజా వార్తలు ప్రతి గ్రామానికి బిటి రోడ్డు : మహేందర్‌రెడ్డి

ప్రతి గ్రామానికి బిటి రోడ్డు : మహేందర్‌రెడ్డి

BT Road to Every Village: Mahender Reddy

రంగారెడ్డి : రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి బిటి రోడ్డు వేస్తామని మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం, రాజధానికి డబుల్ రోడ్లు వేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. మక్తమాదారం – షాద్‌నగర్ మధ్య బిటి రోడ్డు పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. రోడ్ల విస్తరణకు నిధులు ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో బిటి రోడ్లకు రూ.566 కోట్లు కేటాయించి 344 కిలోమీటర్ల మేర రోడ్లు వేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. షాద్‌నగర్ నియోజకవర్గంలో అన్ని రోడ్లను బిటి రోడ్లుగా మార్చామని ఆయన పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు.

BT Road to Every Village: Mahender Reddy