Home జాతీయ వార్తలు బిటెక్ విద్యార్థి ఆత్మహత్య

బిటెక్ విద్యార్థి ఆత్మహత్య

BTech Student Commits Suicide at Miryalaguda

నల్లగొండ : మిర్యాలగూడ పట్టణ శివారు రైల్వేస్టేషన్ పరిధిలో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఎపిలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బిటెక్ విద్యార్థి గడ్డం సుధాకర్ (22)గా గుర్తించారు. ప్రేమ విఫలం కావడం వల్లనే సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం సుధాకర్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.

BTech Student Commits Suicide at Miryalaguda