Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ రూపకల్పన

Collector1

ఆసిఫాబాద్: జిల్లా స్దాయిలో వచ్చే సంవత్సరానికి బడ్జెట్‌కు వివిధ శాఖల అధి కారులు వారివారి శాఖల ప్రణాళికలు,సౌకర్యాలు,అవసరమగు మౌలిక వసతులను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ చంపాలాల్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమిక్ష సమావేశం నిర్వహించారు.

ఐదు సంవత్సరాలకు సరిపడా నిధులకు శాఖల వారిగా ప్రణాళికలు తయారు చేసి రెండు రోజులలో జిల్లా కలెక్టర్‌కు అందించాలన్నారు. వైద్యం, వ్యవసాయం,పంచాయితీరాజ్, రోడ్లు భవనాలశాఖ మహిళా శిశు సంక్షేమశాఖ,హార్టికల్చర్,గిరిజన సంక్షేమం బిసి సంక్షేమంతో పాటు మగిత శాఖలు వారి ప్రణాళికలు తయారు చేసి జిల్లాకు మరిం త సదుపాయలు,మౌళిక వసతులు కల్పించుటలో అధికారులు ముందుడాలన్నారు. జిల్లాకు అభి వృద్ధి పథంలో నడిపించాలన్నారు. అనంతరం సెక్రటరియేట్ హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్‌జిఓ కన్సల్‌టెంట్ బాస్కర్‌రావు బడ్జెట్ రూపకల్పనకు తగు సమాచారం. సలహాలు అధికారులకు అదిం చారు.

అధికారులు డ్యాష్ బోర్డు రూపకల్పన గురించి శాఖల వారిగా ఇండికేటర్స్ ఇవ్వాలని అన్నా రు. ఇండికేటర్స్ ఆధారంగా ప్రతి నెల 15 రోజులకు ఒకసారి సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తామ ని తెలిపారు. నగదు రహిత లావాదేవీలపై స్పెషలాధికారి సర్వేచేసిన రిపోర్లను కంప్యూటరీకరణ పూర్తి చేయాలని,బ్యాంకు అకౌంట్లు లేని వారికి బ్యాంకులలో ఖాతాలు తెరిపించి,ఆధార్ లింకేజీ చేయాలన్నారు. ఈ కార్యక్రంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అశోక్‌కుమార్,సిపిఓ కె కృష్ణయ్య,జిల్లా అ ధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments