Search
Sunday 23 September 2018
  • :
  • :

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం: మృత్యు ఒడిలోకి మూగజీవాలు

Buffelows Dies With Current Shock In Nalgonda District
నిడమనూరుః విద్యుత్ అధికారుల నిర్లక్ష్య ధోరణితో ప్రజలు తీవ్రగాయాలు,మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. మండల పరిధిలోని ఎర్రబెల్లి,మారుతివారిగూడెం,రాజన్నగూడెం,కుంటిగోర్లగూడెం గ్రామాలతో పాటు పలు గ్రామాలల్లో పశుగ్రాసం కోసం వ్యవసాయ పోలాల్లోకి వెళ్లిన గేదెలు విద్యుత్ షాక్‌కు గురై అక్కడిక్కడే మృతి చెందిన సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి.ఈ మధ్య కాలంలో ఆకాలంగా వచ్చిన గాలి దుమారంతో పాటు కురిసిన వర్షానికి ఆయా గ్రామా శివారుల్లోని వ్యవసాయ భూములల్లోని విద్యుత్ తీగలు తెగి పడ్డాయి.ఈ సమయంలో అక్కడే మేత మేస్తున్న మూగజీవాలు ప్రమాదవ శాత్తు విద్యుత్ తీగలు తగిలి గేదెలు అకాల మరణం చెందాయి. అదే విధంగా నిడమనూరు మండలం తుమ్మడం గ్రామ పంచాయితీ పరిధిలోని కుంటిగోర్లగూడెం గ్రామశివారులో ఓ విద్యుత్ కాంట్రాక్టర్ ఎల్ టి విద్యుత్ తీగలు మీదుగా 33/11కేవి విద్యుత్ తీగలు లాగి ఒక వైపు వ్యవసాయ భూమిలో ఉన్న విద్యుత్ స్తంభానికి రెండు (లేదా) మూడు ఫీట్ల ఎత్తులో లాగి వదిలేశాడు.రెండు రోజుల తర్వాత అదే గ్రామానికి చెందిన రైతు మేతకు వెళ్ళిన గేదెలను ఇంటికి తరలించడానికి వెళ్ళిన క్రమంలో విపరీతంగా ఇదురుగాళ్ళు రావడంతో ప్రక్కన ఉన్న ఎల్ టి తీగల మీదుగా లాగిన 33/11కేవి విద్యుత్‌లకు విద్యుత్ సరఫరా అయినట్లు అతను గుర్తించకపోవడంతో వ్యవసాయ భూమిలో ఉన్న విద్యుత్ స్తంభానికి రెండు (లేదా)మూడు ఫీట్ల ఎత్తులోఉన్న స్తంభం వద్దకు వెళ్ళగానే మొదట ఒక గేదె, రైతుకు అక్కడికి వెళ్ళగానే గేదెకు షాక్‌కు గురై అక్కడిక్కడి మృతి చెందింది .రైతుకు మాత్రం తీవ్రగాయాలైయి. ఆ తర్వాత మరో గేదె వచ్చి తీగ తగిలి మృత్యువాత పడింది.అదే విధంగా అకాలంగా వచ్చిన గాలి దుమారంతో పాటు కురిసిన వర్షానికి ఎర్రబెలి,మారుతివారిగూడెం గ్రామ శివారుల్లోని వ్యవసాయ భూములల్లోని విద్యుత్ తీగలు తెగి పడ్డాయి.అక్కడే మేతకు వచ్చిన మూగజీవాలు ప్రమాదవ శాత్తు విద్యుత్ తీగలు తగిలి గేదెలు ఆకాలమరణం చెందాయి.ఎర్రబెల్లిలో ఒకగేదె,మారుతివారిగూడెం గ్రామశివారులో 6గేదెలు విద్యుత్ షాక్‌గురై అక్కడిక్కడేమృత్యువాత పడ్డాయి.మండల వ్యాప్తంగా ఈనెలల్లోనే సుమారు 10గేదెలు విద్యుత్ షాక్‌తో మృతి చెందాయి.మృతి చెందిన గేదెలన్నీ కూడా 10 రోజుల వ్యవధిలోనే మృతి చెందాయి.
చనిపోయిన గేదెలకు 40వేల ఎక్స్‌గ్రేషియాః ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి మరణించిన గేదెలకు తెలంగాణ ప్రభుత్వం రూ.40వేలు ఎక్స్‌గ్రేషియా చేశారు.ఇది వరకు గేదె,ఆవు ప్రమాదవశాత్తు మరణిస్తే ప్రభుత్వం రూ.10వేలు ఎక్స్‌గ్రేషియాగా పాడి రైతుకు మంజూరు చేసేది.ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాడి గేదె,ఆవులకు ప్రమాదవశాత్తు మరణిస్తే ఎక్స్‌గ్రేషియాను రూ.10వేలు-40వేలు పెంచడం జరిగిందని పలువురు పేర్కోన్నారు.
3నెలలకు పైగా వ్యవధిః గేదె మృతి చెందిన రోజు మండల పశువైద్యాధికారి పంచనామ చేసి రిపోర్టు ఇస్తారు.ఆ తర్వాత పంచాయితీ కార్యదర్శి ఆ ఏరియా లైన్‌మెన్‌లు ఇచ్చిన రిపోర్టును బట్టి మండలంలోని విద్యుత్ ఏఈ సంతకం చేస్తారు.బాధితులు ఎవరైతే వున్నారో వారి రేషన్‌కార్డు,ఆధార్‌కార్డు,పాస్‌పోర్టు సైజ్ ఫోటో,మృతిచెందిన గేదె ఫోటో,సంబంధిత కార్యాలయంలో అందించాల్సి వుంటుంది. పూర్తి వివరాలు సిధ్ధం( రెడీ) చేసి విద్యుత్ అధికారులకు అప్పగిస్తే .అతర్వాత మండల విద్యుత్ అధికారులు జిల్లా కేంద్రానికి పంపిస్తారు.అక్కడి అధికారులు వాటిని పూర్తిగా పరిశీలించి సదరు ఫైల్‌ను డివిజన్,నియోజకవర్గ కేంద్రాల నుంచి మండలాలకు తిరిగి రావడానికి మూడు నుంచి నాలుగు నెలలు వ్యవధి అవలీలగా పడుతుందని అధికారులే చెబుతున్నారు.ఇప్పటికైనా విద్యుత్ షాక్‌కు తీవ్ర గాయాలపాలైన,మృత్యువాతపడిన ప్రజలకు ,పాడి గేదె,ఆవుల యాజమానులకు ఎక్స్‌గ్రేషియా వెంటనే అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Comments

comments