Home జాతీయ వార్తలు కుప్పకూలిన భవనం

కుప్పకూలిన భవనం

BULIDING

గుంటూరు : గుంటూరులోని నందివెలుగు రోడ్డులో మణి హోటల్ సమీపంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం శనివారం కుప్పకూలింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇటీవల ఈ భవనం ముందు భాగాన్ని కూల్చివేశారు. ఈ క్రమంలో శనివారం కూలీలు ఈ భనవంలో మరమ్మతు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదాన్ని ముందే పసిగట్టిన కూలీలు బయటికి వచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Building Collapsed in Guntur