Search
Monday 24 September 2018
  • :
  • :

ఆత్మవిశ్వాసం పెరిగేలా..

Self-confidence

ఎంత నైపుణ్యం ఉన్నా వ్యక్తిగతంగా పాటించే కొన్ని జాగ్రత్తలు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు. అలాంటివాటిని అలవరుచుకుంటే కెరీర్‌లో ఎదగడం ఎంతో సులభం. 

వేసుకునే దుస్తులు మూడ్‌పై కొంతవరకు ప్రభావాన్ని చూపుతాయని అంటున్నాయి అధ్యయనాలు. మీరు వేసుకునే దుస్తుల గురించి బయటవాళ్లు పట్టించుకోకపోవచ్చు. కానీ వాటి వల్ల చిన్న అసౌకర్యం ఉన్నా మీకు ఇబ్బంది కలుగుతుంది. దాంతో నలుగురితో సులువుగా మమేకం కాలేరు. ఫలితంగా ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. డిజైనర్‌వేర్, బాగా ఖరీదైనవి వేసుకోవాలనికాదు. పరిశుభ్రమైనవి, సౌకర్యవంతమైనవి వేసుకుంటే ఆత్మవిశ్వాసం పాళ్లు పెరుగుతాయి.

దుస్తులతోపాటు వ్యాయామం కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. సరైన ఆకృతి లేకుంటే నలుగురిలో వెళ్లడానికి ఇబ్బంది పడతారు. తెలియకుండానే వాళ్లకంటే వెనుకబడిపోతారు. ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండేందుకు రోజులో కొంతసమయాన్ని కేటాయించాలి.

ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లు కూర్చున్నా, నిల్చున్నా నిటారుగా ఉంటారు. మీరూ దాన్ని పాటించే ప్రయత్నం చేయండి. అలాకాకుండా వంగిపోయి, చేతులు కట్టుకుని, తలవంచుకుని ఉన్నట్లయితే నిర్లిప్తతకూ, నిరాశకూ మారుపేరని అనిపించుకునే అవకాశం ఉంది.

మీ అడుగులు వేగంగా వేయడానికి ప్రయత్నం చేయండి. కనీసం ఇరవై శాతం వేగంగా నడవడం అనేది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాదు అవతలివారికీ ఆ సంకేతాలను అందిస్తుంది.

ఆఫీసు సమావేశాలు, స్నేహితుల మధ్య ఎక్కడైనా సరే మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం కన్నా ధైర్యంగా మాట్లాడటమే మంచిది.

Comments

comments