Home నిర్మల్ మే 15 నాటికి నిర్మల్‌లో పార్కు

మే 15 నాటికి నిర్మల్‌లో పార్కు

 

stand2

*త్వరలోనే జిల్లా అదనపు కోర్టు ఏర్పాటు *మంత్రి ఇ్రందకరణ్‌రెడ్డి
*ధర్మసాగర్ చెరువుకు సమయానికి చేరుకోని అధికారులు, మంత్రి ఆగ్రహం

మన తెలంగాణ/నిర్మల్‌టౌన్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో మే 15 వరకు స్థానిక ధర్మసాగర్ చెరువులో పార్క్ ఏర్పాటు అవుతుందని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ముందుగా మంత్రి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు కానున్న 7వ అదనపు, సెషన్స్ న్యాయ స్థాన స్థలాన్ని పరిశీలించారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నూతనంగా ఈ కోర్టు ఏర్పడుతుందన్నారు. కళాశాలలో ఒక భాగం కోర్టు, మరో భాగం పాఠశాల నిర్వహిస్తామన్నారు. అనంతరం అక్కడ నుండి స్థానిక ధర్మసాగర్ చెరువును పరిశీలించారు. 65 ఎకరాల శికం భూమిలో నలుమూలన వాకింగ్‌ర్యాగ్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఉదయం, సాయంత్రం పూట ప్రజలు ఆహ్లాదం కోసం రానున్నందున వారికి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలన్నారు. గాజుల్‌పేట్, బస్‌స్టాండ్ రోడ్డు వైపు పార్కింగ్‌కు స్థలాలు ఏర్పాటు చేయాలన్నారు. రూ.4.5 కోట్లతో నిర్మించే ఈ అభివృద్ధి పనులు గత సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్నాయన్నారు. కలెక్టర్ చొరువతోనే పనులు ముందుకు సాగుతున్నాయన్నారు. అంతక ముందు కొచ్చెరువులో జరుగుతున్న నూతన కలెక్టర్ కార్యాలయాల పనులను పరిశీలించారు.
* ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం : స్థానిక ధర్మసాగర్ చెరువుకు మంత్రి వస్తున్నారన్న సమాచారం ఉన్నప్పటికి కూడా అధికారులు సమయ పాలన పాటించపోవడంతో మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ది పనులు ఏవిధంగా జరుగుతున్నాయో ఎవరిని అడుగాలన్నారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవండతోనే ఇలా ఇష్టానూసారంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజాప్రతినిధులు అంటే అధికారులకు లెక్క లేకుండా పోయిందన్నారు. అలాగే 65 ఎకరాల శికం భూమిలో ఇరిగేషన్, సర్వే డిపార్ట్‌మెంట్ రెండు శాఖ మధ్య సమన్వయం లేకపోవడంతో ఎవరి ఇష్టానూసారం వారు సమాధానాలు తెలిపారు. కలెక్టర్ కూడా ఇరిగేషన్ అధికారులు, సర్వే డిపార్ట్‌మెంట్ అధికారులకు అడిగిన ప్రశ్నలకు సమాధానం రాకపోవడంతో ఆమె కూడా అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంతి,ఆర్‌డిఒ ప్రసునాంబ, ఎఫ్‌ఎస్‌సిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్‌చక్రవర్తి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, కౌన్సిలర్ గోపి, సుధాకర్, ధర్మాజి గారి రాజేందర్, సర్పంచ్ గాళ్ళ విలాస్, రమేష్‌రెడ్డి, నాయకులు అయ్యన్నగారి రాజేందర్, సత్యనారాయణ,కోట నర్సయ్య, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.