Home తాజా వార్తలు శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం

శంషాబాద్ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం

Shamshabad-Airport

హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం బుల్లెట్ కలకలం సృష్టించింది. హైదరాబాద్ నుంచి అబుదాబి వెళ్తున్న ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్ దొరికింది. సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది తనిఖీల్లో భాగంగా సదరు ప్రయాణికుడి వద్ద బుల్లెట్ లభ్యమైనట్లు తెలిసింది. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న విమానాశ్రయ భద్రతా సిబ్బంది విచారణ చేపట్టారు.