Home జాతీయ వార్తలు బుల్లెట్ స్పీడ్

బుల్లెట్ స్పీడ్

55555555న్యూఢిల్లీ హైదరాబాద్ హౌస్‌లో ఒప్పంద పత్రాలు ఇచ్చి పుచ్చుకుంటున్న   జపాన్ ప్రధాని షింజో అబే, ప్రధాని మోడీ 

భారత్  జపాన్ బంధం

మూడు కీలక ఒప్పందాలపై సంతకాలు

న్యూఢిల్లీ : రెండు అత్యంత కీలక ఆసియా దేశాలు జపా న్, భారత్‌ల మధ్య బంధం మరింత పటిష్టం అయింది. ద్వైపాక్షిక సంబంధాలను నూతన దశకు చేరుస్తూ భార త్, జపాన్‌లు శనివారం కీలక రంగాలలో పలు ఒప్పం దాలపై సంతకాలు చేశాయి. మూడు రోజుల పర్యటనకు భారత్‌కు వచ్చిన జపాన్ ప్రధాని షింజో అబేతో ప్రధాని మోడీ విస్తృత చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఒప్పం దాలపై సంతకాలు జరిగాయి. బుల్లెట్ ట్రైన్, రక్షణరం గాలతో పాటు పౌర అణు ఇంధన ఒప్పందాలు కుదిరా యి. భద్రత, సహకారం దిశగా అడుగులు పడినట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఇక్కడ అబేతో కలిసి సంయుక్తంగా విలేకరులతో మాట్లాడారు. భారత దేశంలో బుల్లెట్ ట్రైన్ల నిర్వహణకు జపాన్ ఆసక్తి కనబ ర్చింది. భారతదేశంలో తొట్టతొలి బుల్లెట్ ట్రైన్‌ను ప్రవేశ పెట్టడంలో జపాన్ పూర్తిగా సహకరిస్తుంది. ముంబయి- అహ్మదాబాద్‌ల మధ్య శరవేగంతో సాగే ఈ రైలు ఏర్పాటుకు రూ. 98వేల కోట్లు వ్యయం అంచనా వేశారు. భారత్ ఆర్థిక కలలను జపాన్‌లాగా మరే ఇతర దేశం అర్థం చేసుకోలేదని, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి జపాన్ మద్దతు ఇవ్వడం కీలక విషయం అని మోడీ చెప్పారు. ప్రధానుల భేటీలో అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై చర్చ జరిగింది. భద్రతా మండలి సంస్కరణల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. భార త్ ఆర్థిక కలల సాకారానికి జపాన్ అందిస్తోన్న సహ కారం మరవలేనిదని ప్రధాని చెప్పారు. అబే తనకు వ్యక్తి గత స్నేహితుడని, ఇండో-జపాన్ భాగస్వామ్య ప్రక్రియ కు అబే ఉదాత్త నాయకుడుగా ఉన్నారని తెలిపారు. అత్యంత కీలక ఒప్పందాలు కుదిరాయని, ఇందులో హైస్పీడ్ రైలు అత్యంత వేగంతో పాటు భద్రత, ప్రయా ణంపై భరోసా కూడుకుని ఉంటుందని ఈ ప్రాజెక్టుకు సరళమైన నిబంధనలతో జపాన్ ట్రిలియన్ యెన్‌లు (దా దాపు రూ. 54వేల కోట్లు) రుణంతో కూడిన అసాధా రణ ప్యాకేజీని దాదాపు 12 బిలియన్ డాలర్ల మేరకు దానితో పాటు సాంకేతిక సహకారాన్ని కల్పించడం ఆ యన ఉదారతకు నిదర్శనమని మోడీ మెచ్చుకున్నారు.  పౌర అణు ఇంధన ఒప్పందం ప్రపంచ భద్రతాకోణంలో  జపాన్‌తో పౌర అణు ఇంధన సహకారంలో అవగావహ నా ఒప్పందం కుదిరిందని, ఇది కేవలం వాణిజ్యపరమై న, స్వచ్ఛ ఇంధనపరమైన ఒప్పందంగానే భావించరాద ని ఒప్పందంగా భావించుకుంటే సరిపోదని, పరస్పర నమ్మికను సమున్నత స్థాయికి తీసుకువెళ్లే ప్రక్రియ అని, అంతేకాకుండా శాంతియుత భద్రతాయుత ప్రపంచ పరి రక్షణకు కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యం అని ప్రధా ని మోడీ ప్రస్తావించారు. హైస్పీడ్ రైలు ఏర్పాటుతో దేశం లోని ఆర్థిక కేంద్రం ముంబైకి, అహ్మదాబాద్‌కు కేవలం మూడు గంటలలో చేరుకునే వీలేర్పడుతుంది. ఇప్పుడు ఈ ప్రయాణానికి కనీసం 8 గంటలు పడుతోంది. ఇక రెండు దేశాలూ రక్షణ పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానం పంపిణీకి సంబంధించి ఒప్పందం ఒకటి, మరోటి రహ స్య సైనిక సమాచారం భద్రతకు తీసుకోవల్సిన చర్యల గురించి కుదిరింది. ఉభయదేశాల మధ్య భద్రతా సహకారానికి ఈ ఒప్పందాలు నిర్ణయాత్మక భూమిక వహిస్తాయని మోడీ తెలిపారు. రక్షణ సంబంధాలు మ రింతగా పటిష్టం అయి, భారత్‌లోనే రక్షణ ఉత్పత్తుల త యారీకి ప్రోత్సాహం అందించినట్లు అవుతుందని , మల బార్ నౌకా విన్యాసాలలో జపాన్‌ను కూడా భాగస్వా మ్యం చేసుకునేందుకు వీలేర్పడిందని చెప్పారు. ఇరు దే శాల నేతలూ చర్చల అనంతరం ఇండియా, జపాన్ విజన్ 2025 పేరిట సంయుక్త ప్రకటనను వెలువరిం చారు. ప్రపంచ శాంతికి, ఇండో పసిఫిక్ సంక్షే మం, భద్రతకు ఉద్దేశించి పలు అంశాలు ఈ విజన్‌లో పొందు పర్చారు. అణు ఇంధనాన్ని ప్రపంచ శాంతికి విని యోగించుకోవాలనే లక్షంతోనే రెండు దేశాలు కలిసి కట్టుగా పనిచేస్తాయని, అణు ఇంధన ఒప్పందం కుదిరిం ది కానీ దీనిపై తుది సంతకాలు పూర్తి స్థాయిలో సాం కేతిక వివరాలను ఖరారు చేసిన తరువాత జరుగుతా యని , అంతేకాకుండా దీనికి సంబంధించి అవసరమైన అంతర్గత నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుం దని మోడీ చెప్పారు. భారత్- జపాన్ ప్రత్యేక బంధానికి గుర్తుగా భారతదేశం వచ్చే ఏడాది మార్చి 1 నుంచి జపాన్ పౌరులందరికీ వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని విస్తరిస్తుందని వెల్లడించారు. అబే మాట్లాడుతూ సంబం ధాలు సమున్నత దిశకు వెళ్లాయని, మొగ్గలు ఇప్పుడు వికసించి పూలుగా మారుతున్నాయని విశ్లేషించారు. ఈ స్ట్ ఆసియా సమ్మిట్‌లో భారత్-జపాన్‌లు ఉమ్మడిగా వ్యవహరిస్తాయని ప్రాంతీయ స్థాయిలో సహకారం మ రింత పారదర్శకంగా , సమతూకంగా ఉండేందుకు, ఈ ప్రాంతంలో సముద్ర జలాల భద్రతకు కలిసికట్టుగా వ్య వహరిస్తాయని ఇరువురు నేతలు తెలిపారు. పలు అంత ర్జాతీయ సంస్థలలో ప్రత్యేకించి అపెక్ వంటి వాటిలో భారత్‌కు సభ్యత్వంకోసం జపాన్‌అందించిన సహకారం మరవలేనిదని చెప్పారు. రెండు దేశాల సత్సంబంధాలకు ప్రతీకాత్మకంగా క్యోటో-వారణాసి భాగస్వామ్యం నిలు స్తుందని, సంబంధాలకు సాంస్కృతిక, మానవీయ కోణం అలుముకుందని మోడీ తెలిపారు. గత ఏడాది ప్ర ధాని మోడీ జపాన్ పర్యటన సందర్భంగా అక్కడి చారిత్ర క పురాతన నగరం క్యోటోను సందర్శించారు. ఇప్పుడు జపాన్ ప్రధాని అబే భారత్‌లోని అత్యంత పురాతన పట్ట ణం వారణాసిని సందర్శనను తలపెట్టారు. ప్రాచీన నగ రాలను చరిత్ర చెక్కుచెదరకుండా రక్షించడంలో జపా న్‌లోని క్యోటో వంటి నగరాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయని అప్పట్లో మోడీ చెప్పారు. ద్వైపాక్షిక, ప్రాం తీయ అంతర్జాతీయ స్థాయిలో ఉమ్మడిగా వ్యవహరించ డంతో పాటు అంతర్జాతీయ సమాజపు 21వ శతాబ్ది కలలు నిజం అయ్యే దిశలో ఇరుదేశాల బంధం ఆదర్శం గా ఉంటుందని ప్రధాని తెలిపారు. సముద్ర జలాల వివా దాల గురించి కూడా ఇరు దేశాల నేతలు చర్చించారు. ఇ లాంటి అంశాలను పరస్పర సంప్రదింపులతోనే సభ్య దే శాలు పరిష్కరించుకోవల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఉత్తర కొరియా ధోరణిపై ఆందోళన
ఉత్తర కొరియా వివాదాస్పద అణు కార్యక్రమాల గురి ంచి ఇరుదేశాల నేతలు ప్రత్యేకంగా చర్చించారు. ఆ దే శం సాగిస్తోన్న అణ్వాయుధ తయారీపై ఆందోళన వ్య క్తం చేశారు. యురేనియం శుద్ధి కార్యక్రమం , క్షిపణి తయారీ వంటివి శాంతికి భంగకరంగా మారుతాయని తెలిపారు. అంతర్జాతీయ షరతుల మేరకు ఉత్తర కొరి యా వ్యవహరించాలని, కట్టుబాట్లను పాటించాలని కోరారు. మండలి చేసిన సంబంధిత తీర్మానాలను ఆ దే శం గౌరవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ ప్రాం తం అణ్వాయుధమయం కావడం ప్రమాదకరం అని పేర్కొన్నారు. హిరోషిమా, నాగసాకిలపై అణు బాంబు దాడులు జరిగి 70 ఏళ్లు అయిన సందర్భంగా అప్పటి ఉపద్రవంపై ఆందోళన వ్యక్తం చేసి, అణ్వాయుధాల సం పూర్ణ నిర్మూలనకు కట్టుబడి ఉంటామని ప్రతిన వహిం చారు. అణు పరీక్షల నిషేధ ఒప్పందాన్ని పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకురావల్సి ఉందన్నారు.