Home తాజా వార్తలు బుమ్రా ప్రపంచ శ్రేణి బౌలర్

బుమ్రా ప్రపంచ శ్రేణి బౌలర్

హైదరాబాద్: ముంబయి ఇండియన్స్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రపంచ శ్రేణి బౌలరే అయినప్పటికీ అతనిలో ఇంకా చాలా ప్రతిభ దాగి ఉందని అభిప్రాయపడ్డాడు క్రికెట్ లెజెండర్ సచిన్ తెండూల్కర్. ఆదివారం చెన్నైతో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం యువరాజ్‌సింగ్ చేసిన ఓ ఇంటర్వూలో సచిన్ ఈ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లోని అన్ని మ్యాచ్‌లలో డెత్ ఓవర్లలో బౌల్ చేసిన బుమ్రా అద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో కూడా బుమ్రా నాలుగు ఓవర్లు బౌల్ చేసి రెండు వికెట్లు తీయడంతో పాటు కేవలం 14 పరుగులే ఇచ్చాడు. ఆ తర్వాత సచిన్ స్టార్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ లెగ్ స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను మెచ్చుకున్నాడు. ‘నాలుగు ఓవర్లలో 13 డాట్ బాల్స్ వేసి కేవలం 14 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఇది అద్భుతమైన ప్రదర్శన. అతను మొదటి మ్యాచ్ ఆడక ముందే మహేల జయవర్దనెతో నా అభిప్రాయాన్ని పంచుకున్నా.. ఆరునుంచి 15 ఓవర్ల మధ్య అతని బౌలింగ్ చాలా బాగుంది’ అని పేర్కొన్నాడు. మహేల జయవర్దనే కూడా చాహర్‌ను చాలా నైపుణ్యం కల బౌలరని ప్రశంసించాడు.

Bumrah world best bowler: Sachin