Home తాజా వార్తలు తొలిసారి డబుల్ రోల్

తొలిసారి డబుల్ రోల్

‘నా పేరు సూర్య…’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ శనివారం త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను కూడా ఈ స్టార్ హీరో లైన్‌లో పెట్టారు. త్రివిక్రమ్ సినిమా తర్వాత సుకుమార్‌తో చిత్రం, చివరగా వేణు శ్రీరామ్-దిల్‌రాజు సినిమా సెట్స్‌పైకి వెళ్తాయి. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రానున్న ‘ఐకాన్’ ఈ ఏడాది చివరలో పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఈ సినిమాలో బన్నీ సరసన ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

అంతేకాదు ఈ సినిమాలో మరో స్పెషాలిటీ కూడా ఉందట. బన్నీ తన కెరీర్‌లో తొలిసారి డబుల్ రోల్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారట. ఇందులో బన్నీ పోషించే రెండు పాత్రలు పూర్తి విభిన్నంగా ఉంటాయని తెలిసింది. ఈ స్టార్ హీరో ప్రతి సినిమాలో తన గెటప్ డిఫరెంట్‌గా ఉండేలా చూసుకుంటారు. ఇక డబుల్ రోల్ అంటే ఒక పాత్రకు రెండో పాత్రకు సంబంధం లేకుండా తన లుక్‌లో కొత్తదనం చూపించడం ఖాయం. ఇప్పటివరకు 18 సినిమాలు చేసిన బన్నీ ఒక్కసారి కూడా ద్విపాత్రాభినయం చేయలేదు. అలాంటిది ఇప్పుడు ఒప్పుకున్నాడంటే వేణు శ్రీరామ్ కథలో ఏదో కొత్తదనం ఉండే ఉంటుంది.

Bunny dual role in Venu Sriram-Dil Raju movie!