Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

టిఆర్‌ఎస్ ర్యాలిలో పేలిన బాణసంచా

Bursting Arrow in TRS rally
ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు
ఇద్దరి పరిస్థితి విషమం
ఐదుగురు మహిళలకు స్వల్ప గాయాలు

కొత్తగూడెం కలెక్టరేట్: టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలిలో బాణసంచా పేలి 5 మంది యువలకు తీవ్ర గాయాలపాలు కాగా 5 మంది మహిళలకు స్వల్పగాయాలైయ్యాయి. ప్రమాద సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. స్థానిక నాయకుడు వీరబాబు తన అనచరులతో టిఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు గురువారం సన్నాహాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపధ్యంలో సింగరేణి ఉమెన్స్ కాలేజి నుండి అనుచరులు, అభిమానులతో కలిసి ర్యాలి నిర్వహించారు. ఈ ర్యాలిలో నృత్యాలు, డిజె, బానాసంచా కాలుస్తూ.. అందరు ఉత్సహాంగా పాల్గొన్నారు. ఉమెన్స్ కాలేజి నుండి బస్టాండ సెంటర్ వరకు ర్యాలి చేరుకోగానే అనుకోకుండా అపసృతి చోటుచేసుకుంది. బాణసంచా కాలుస్తున్న యువకుల తమ పనిలో తాము నిమగ్నమై ఉన్నారు. ఆయితే అకస్మాత్తుగా ఓ నిప్పు రవ్వ వచ్చి బాణసంచా ఉన్న సంచిలో పడింది. అప్పటికే యువకులు అది గమనించిన్నప్పటికి ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్క సారిగా ర్యాలిలో ఉన్న వారంత కంగు తిన్నారు. ఏమైంది అని చూసేలోపే ఆ ప్రమాదంలో 5 మంది యువకులకు తీవ్ర గాయాలు పాలవ్వడంతో పాటు 5 మంది మహిళలకు స్వల్ప గాయాలైయ్యాయి. ర్యాలిలో పాల్గొన్నవారు కొందరు హుటాహుటినా క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయాలు పాలైన వారిలో చీమల వినోద్, ఆవుల వినోద్, చింత మహేందర్, కంగల వినోద్, గుమ్మడి సాయిలు ఉన్నారు. చీమల వినోద్, ఆవుల వినోద్‌లకు తీవ్ర గాయాలు అవ్వగా.. మిగితా వారికి స్వల్ప గ్యాలయ్యాయని, తీవ్ర గాయాలు పాలైన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. గాయాలు పాలైన యువకులందరు పట్టణంలోని పాత కొత్తగూడెం వాస్తవ్యులే. కూలీ నాలి చేసకునే కుటుంబాల వారికి ఇలా జరగడం స్థానికుల మనుస్స కలిచివేసింది. వారిని పార్టీ నాయకులు ఆధుకోని మొరుగైన చికిత్స అందించాలని కుటుంబికులు, స్థానికులు కోరుతున్నారు.

Comments

comments