Home నిర్మల్ రఫీకి ప్రతిష్ఠాత్మక బస్ అవార్డ్’

రఫీకి ప్రతిష్ఠాత్మక బస్ అవార్డ్’

                  Bus-driver

మన తెలంగాణ / హైదరాబాద్: టిఎస్‌ఆర్‌టిసి భైంసా డిపోకు చెందిన డ్రైవర్ మహ్మద్ రఫీ జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక ‘ఇండియా బస్ అవార్డ్’ కైవసం చేసుకున్నారు. రఫీ (ఇ-100487) 34 ఏళ్ళ పాటు ప్రమాదరహితంగా సర్వీసును అందించినందుకు అశోక లేలాండ్-అభి బస్ సంస్థలు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశాయి. బస్ భవన్‌లో గురువారం టిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ జి.వి.రమణరావు ‘ఇండియా బస్ అవార్డ్’ను డ్రైవర్ రఫికి అందజేశారు. ఇంతకు ముందు జనవరిలో రోడ్డు భద్రతా వారోత్సవాలలో ‘ఉత్తమ ప్రమాద రహిత సర్వీసు అవార్డు’ను కూడా రఫీ అందుకున్నారు. పలు అవార్డులు అందుకున్న రఫీని ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు డి.వేణు, ఎ.పురుష్తోత్తం నాయక్ తర అధికారులు పాల్గొన్నారు.