Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

బస్సు పోతుంది.. గుంత పడింది.. అంతే గుంతలో పడిపోయిన బస్సు..దాని వెనుకే కారు…!!

Bus and Car Trapped as Road Caves in Chennai

చెన్నైలో ఓ బస్సు, కారు కు రోడ్డు ప్రమాదం తప్పింది. చెన్నైలోని మౌంట్ రహదారి లో ఉన్న జెమిని ఫ్లై ఓవర్ సమీపంలో ఓ బస్సు వెళ్తోంది. బస్సు వెళ్తుండగానే రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో ఆ బస్సు రోడ్డు మీద పడిన గుంతలో పడిపోయింది. ఆ బస్సు వెనకే వస్తున్న కారు కూడా అందులో దిగబడిపోయింది. బస్సులో ఉన్న కొంత మంది ప్రయాణికులకు, కారులోని వారికి గాయాలు కాగా వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు కు దగ్గర్లోనే మెట్రో రైల్ వర్క్ నడుస్తుండటమే రోడ్డు కుంగిపోవడానికి కారణమయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వారం రోజుల క్రితం జెమిని ఫ్లై ఓవర్ ఏరియాలో ఇలాగే రోడ్డు కుంగిపోయింది.

దానికి సంబంధించిన వీడియో ఇదే…

(Courtesy:The Times of India)

Comments

comments