Home జాతీయ వార్తలు బస్సు ఢీ : తల్లీకొడుకు మృతి

బస్సు ఢీ : తల్లీకొడుకు మృతి

road-accident-image-doneఅనంతపురం : మడకశిర సమీపంలోని కర్నాటక సరిహద్దు పావగడ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు చనిపోయారు. పావగడ తాలూకాలోని చేతగానచర్ల గ్రామానికి చెందిన ఓ కుటుంబం బైక్‌పై వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఓ ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మమ్మ(28), ఏడాది వయస్సు ఉన్న ఆమె కొడుకు అక్కడికక్కడే చనిపోయారు. లక్ష్మమ్మ భర్త , కుమార్తె స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.