Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ప్రయాణీకుల నిలువుదోపిడీ

కంప్యూటర్ టికెట్‌మిషన్ల పేరిట దోపిడి
పట్టించుకోని ఆర్‌టిసి అధికారులు
లబోదిబోమంటున్న ఆర్‌టిసి ప్రయాణీకులు

Conductor1

ఇల్లందకుంట(జమ్మికంపట డివిజన్): టికెట్ల పంపిణీ సత్వరమే పూర్తి చేయడానికి ఆర్టీసి ప్రవేశపెట్టిన కంప్యూటర్ టికెట్ల మిసన్ల వల్ల బస్సు ప్రయాణీకుల జేబులకు గండి పెడుతున్నారు. మ్యాన్‌వెల్‌గా టికెట్ లు ఇచ్చిన ఎడల ప్రయాణీకులకు ఎలాంటి కష్టనష్టాలు జరిగేవికావు.వేగంగా టికెట్ ల పంపిణిని పూర్తిచేయడానికి ఆర్టీసి అధికారులు కండక్టర్లకు ఆటోమెటిక్ టికెట్ జారీ మిషన్ లను పంపిణీచేశారు. హుజురాబాద్ డిపో పరిధిలో సుమారు 70 వరకు అటోమెటిక్ టికెట్ మిషన్ లు ఉండగా హుజురాబాద్ నుండి ఇల్లందకుంట జమ్మికుంట ,వీణవంక,కరీంనగర్,వరంగల్,కమలాపూర్,పర్కాల రూట్లలో బస్సులు తిరుగుతున్నాయి.అయితే హుజురాబాద్ జమ్మికుంట సెక్టార్ లో ఆర్టీసి కండాక్టర్లు అటోమెటిక్ టికెట్ మిషన్ల పేరిట ప్రయాణీకులను నిలువుదోపిడికి గురిచేస్తున్నారు.

హుజురాబాద్ జమ్మికుంట మద్య టికెట్ ధర 11రూపయాలు నిర్ణయించడంతో కండాక్టర్ల పంటపండుతుంది.చిల్లర సమస్యలను కొందరు కండక్టర్లు తెలివిగా అధనపు ఆదాయ వనురుగా మార్చుకుంటున్నారు. 10రూపయాలు ఇస్తే టికెట్ ఇవ్వం బస్సుదిగి వెళ్లిపొంమంటున్నారు.చాలా సందర్భాలో ప్రయాణీకుల దగ్గర ఒకరూపాయి చిల్లర ఉండడంలేదు.నరే్రందమోడీ ప్రభావం వల్ల 500,100 రూపయాల నోట్లు కూడా హుజురాబాద్ రూట్ లో గత్యంతరం లేక కండక్టర్ల చేతిలో పెడుతున్నారు.వారు టికెట్ కనుక ఇవ్వవల్సి పైసలను రాస్తున్నారు.కొంతమంది ప్రయాణీకులు మోత్కులగూడెం చౌరస్తాలో హడావిడిగా దిగి డబ్బులను తీసుకోకుండానే మర్చిపోయి వెళ్లిపోతున్నారు.

అయితే కండక్టర్ లు ఇచ్చిన టికెట్‌లో ముద్రణ కనిపించకుండా ఉండడంతో బస్సు నెంబర్ గాని టికెట్ పేరు గాని డ్రైవర్ కండక్టర్ల నెంబర్లు కాని టికెట్‌లో స్పష్టంగా కనబడడంలేదు. క

ఈ నెల 1వ తేదీన సాయ్రంతం 5గంటలకు హుజురాబాద్‌లో ఒక ప్రయానీకుడు హుజురాబాద్ జమ్మికుంటకు వచ్చే బస్సు ఎక్కాడు. కండక్టర్‌కు 100 నోటు ఇవ్వగా కండక్టర్ 90రూపాయలు బాకి ఉన్నట్టుగా టికెట్ వెనుక రాసిఇచ్చారు. బస్సులో కెపాసిటి మించిన జనం ఉండడంతో ప్రయాణీకులు హడావిడిగా మోత్కులగూడెం చౌరస్తాలో దిగి వెళ్లిపోయారు. 3రోజుల నుండి కండక్టర్ కోసం జమ్మికుంట బస్టాండ్‌లో నిరీక్షించినప్పటికి సదరు ఇదే మండలానికి చెందిన కండక్టర్ సెల్‌ఫోన్ స్విచ్‌ఆఫ్‌చేసుకున్నది.

చివరకు శనివారం డ్యూటికి రాగా తాను 90 రూపాయలు బాకి ఉన్నమాట నిజమేనని సదరు కండక్టర్ ఆర్టీసి సత్యం ముందు అంగీకరించారు. అయితే టికెట్ ను తెచ్చిచూపిస్తేనే డబ్బులు ఇస్తామని చెప్పడంతో ప్రయాణీకులు ఇదేమిన్యాయం ప్రశ్నించారు. ఆర్టీసి అధికారులు సరైనముద్ర లేకుండా ఇచ్చి ప్రయాణీకులను మోసం చేస్తున్నారని ఇప్పటికైనా హుజురాబాద్ ఆర్టీసి అధికారులు స్పంధించి ప్రయాణీకులను దోపిడి చేస్తున్న కండక్టర్లపై కఠినచర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Comments

comments