Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి

Bus Driver died in Road Accident

ముంబయి : మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని కెగ్డావ్ బైపాస్ వద్ద శనివారం ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఔరంగాబాద్‌లో జరగనున్న ఓ సదస్సుకు హాజరయ్యేందుకు ముంబయిలోని టాటా కేన్సర్ ఆస్పత్రికి చెందిన వైద్యుల బృందం ఈ బస్సులో ప్రయాణిస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Bus Driver died in Road Accident

Comments

comments