Search
Wednesday 21 November 2018
  • :
  • :

కొండెంగతో బస్సును నడిపించిన డ్రైవర్…..

Bus-Driver-Driving-with-Lan

బెంగళూరు: కొండెంగతో బస్సును నడిపించి డ్రైవర్ తన ఉద్యోగాన్ని పొగొట్టుకున్న ఘటన కర్నాటకలోని దేవనాగరిలో జరిగింది. దేవనాగరి డిపో డ్రైవర్ కొండెంగతో బస్సును నడిపించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీంతో  విధుల్లో నిరక్ష్యం వహించినందుకు డ్రైవర్ ను ఆర్టిసి అధికారులు సస్పెండ్ చేశారు. కొండెంగతో బస్సు నడిపించి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడాడని డ్రైవర్ పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కొండెంగతో  డ్రైవర్ బస్సునడిపిస్తున్న దృశ్యాలను వీడియో తీసి కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ఈ ఘటనలో డ్రైవర్ పై ప్రయాణికులు మండిపడ్డారు. డ్రైవర్ చేసిన పనికి ఆర్టిసి ఉన్నతాధికారులు ప్రయాణికులను క్షమాపణలు  కోరినట్టు సమాచారం.

 

 

 

Telangana news

Bus Driver Driving with Langur in Karnataka

Comments

comments