Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

తిరుత్తణి కొండపై నుంచి పడిన బస్సు: ఒకరి మృతి

bus-Fell

చెన్నై: తమిళనాడులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుత్తణి కొండపై నుంచి బస్సు బోల్తాపడింది. ఆటోపై బస్సు పడడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సుబ్రహ్మణ్యం స్వామి ఆలయానికి వెళ్లి వస్తుండగా ఘటన జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, ప్రయాణికులు ఆరోపణలు చేశారు.

Comments

comments