Home జాతీయ వార్తలు నదిలోకి బస్సు బోల్తా : 37మంది మృతి

నదిలోకి బస్సు బోల్తా : 37మంది మృతి

గుజరాత్‌లోని సుపా గ్రామం వద్ద దుర్ఘటన
River1అహ్మదాబాద్: గుజరాత్‌లో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 37మంది ప్రయాణికులు మరణించారు. శుక్రవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దక్షి ణ గుజరాత్ నవ్‌సారి జిల్లాలోని పూర్ణా నది బ్రిడ్జి మీద నుంచి వెళ్తోన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు హఠాత్తుగా అదుపుతప్పి నదిలోకి బోల్తా కొట్టి ముని గిందని పోలీసులు చెప్పారు. బస్సు నవ్‌సారి నుంచి ఉకాయికి ప్రయాణికులతో వెళుతుండగా సుపా గ్రామం వద్ద ఈ బస్సు ప్రమాదం జరిగినట్టు వివరించారు. పూర్ణానదిలోకి బస్సు బోల్తా పడ్డ అనంతరం నదిలో నుంచి 20 మృతదేహాలను వెలికితీసినట్టు నవ్‌సారి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఎంఎస్.భరదా మీడి యాకు తెలిపారు. బస్సులో ఎంతమంది ప్రయాణిస్తున్నారన్న కచ్చితమైన వివ రాలు తమకు అందలేదని, అయితే నిర్దేశిత సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోందని భరదా చెప్పారు. ప్రమాదస్థలి నవ్‌సారికి అహ్మదాబాద్ 285 కి.మీ.దూరంలో ఉందని ఆయన వివరించారు. సంఘటనాస్థలి వద్ద సహా యక పునరావాస కార్యక్రమాలలో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, 108 అంబులెన్స్ సర్వీసుల సిబ్బంది పాల్గొన్నట్టు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భరదా చెప్పారు.