Home వనపర్తి 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

Bus-Accident

కొత్తకోట ః మండల పరిధిలోని విలియంకొండ గ్రామ సమీపంలో గురువారం బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బెంగుళూర్ నుండి ఎపి 27 టిజడ్ 4166 అనే నెంబర్ గల బస్సు సిరోజ్ అనే డ్రైవర్ 30 మంది ప్రయాణీకులను ఎక్కించుకొని బుధవారం రాత్రి 8 గంటల సమయంలో హైదరాబాద్ కు బయలు దేరారు. గురువారం తెల్లవారుజామున విలియంకొండ సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయగా అదుపు తప్పి బస్సు బోల్తా పడినట్లు హెడ్‌కానిస్టేబుల్ విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. బస్సులో ప్రయాణిస్తున్న గౌతం,రవికుమార్, సీతాదేవి, విజయలక్ష్మీ,శ్రీనివాస్‌రావు, రఘుమోహన్‌లకు స్వల్ప గాయాలయ్యాయి . క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు.

Bus Roll Over On 44 national Highway In Wanaparthy Dist