Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కుప్పకూలిన బస్టాండ్…. అంతా అయోమయం

గని బ్లాస్టింగే కారణమా?
House

కాసిపేట: ఏ వాహనం ఢీకొట్టలేదు, ఎవరు కూడా కూల్చలేదు అయినా బస్టాండ్ కూలిపోయింది. ప్రస్తుతం ఇక్కడ బస్టాండ్ కూలడం అంతు చిక్కని ప్రశ్నగా మిగిలి పోయింది. మండల కేంద్రానికి వెళ్ల్లే రహదారి బైపాస్ రోడ్డు సమీపంలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ సౌజన్యంతో ప్రయాణికుల విశ్రాంతి కొరకు బస్ షెల్టర్‌ను నిర్మించారు. కాగా ఏమి జరిగి ందో ఏమో కాని బస్టాండ్ మాత్రం కూలిపోయింది. పలువురు మాత్రం పలురకాల ఆరోపణలు మాత్రం చేస్తున్నారు. ఇక్కడ కాసిపేట గని ఉండడంతో గనిలో ఉత్పత్తి కొరకు పేల్చుతున్న బాంబుల తాకిడి వల్లే బస్టాండ్ కూలీ ఉంటుందనే ఆరోపణలు వస్తున్నాయి. లేదా ఎవరైనా బస్టా ండ్‌పైన వున్న రేకులు, పైపుల కొరకు కూల్చివేసారా అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. కాని పైపులు, రేకులు మాత్రం జాగ్రత్త గానే ఉండడం గమనార్హం. బస్టాండ్ ప్రాంగణం క్రింద కాకుండా ఎత్తులో పడిపోవడంతో ఏమి జరిగి ఉంటుందనేది అనూమానాస్పదంగా మారింది.

Comments

comments