Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

విద్య, వైద్యం, ఉపాధి కోసమే బస్సుయాత్ర

ప్రజా సమస్యల పరిష్కారానికి
నిధులు కేటాయించని ప్రభుత్వాలు
ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు
వేణు, మరుపాక అనిల్
వనపర్తి జిల్లాకు చేరిన బస్సుయాత్ర

CPI

వనపర్తి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వి ద్య, వైద్య ఉపాధి హక్కులను నిర్లక్షం చేస్తున్నాయని, వాటి సాధన కోసమే ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్, ఆధ్వర్యం లో ఈ నెల 20 నుంచి సిఎం కెసిఆర్ సొంత నియోజక వర్గమైన గజ్వేల్ నుంచి బస్సుయాత్ర చేపట్టడం జరిగింద ని ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షు లు వేణు, మారుపాక అనిల్ అన్నారు. ఆదివారం బస్సు యాత్ర వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జి ల్లాలో సాగింది. ఈ సందర్భంగా వనపర్తిలో జరిగిన కా ర్యక్రమంలో ముందుగా అంబేడ్కర్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం రాజీవ్‌చౌక్  లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ప్రభుత్వాలు విద్య, వైద్యం, ఉపాధి కోసం నిధులు ఖర్చు చేయడం లేదని డ బ్లూటిఒ ఒప్పందాల ద్వారా విదేశీ విద్యా సంస్థలకు అ నుమతిస్తూ, దేశంలో విద్యను వ్యాపారం చేసేందుకు ప్ర యత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. ఎఐఎస్‌ఎఫ్ రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి శివరామకృష్ణ మాట్లాడుతూ ఉద్య మంలో విద్యార్థుల పాత్ర మరువలేనిదని, కానీ రాష్ట్రం ఏ ర్పడి రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమా న్ని పూర్తిగా విస్మరించిందన్నారు. నాగర్‌కర్నూల్‌లో గాం ధీ పార్కు నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ గురుకులాల్లో కనీస వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్ర భుత్వం విఫలమైందన్నారు.

బడ్జెట్ సమావేశంలో అరకొ ర నిధులు కేటాయిస్తూ ఖజనా ఖాళీ అయిందంటూనే ధ నిక రాష్ట్రం, ధనిక ప్రభుత్వం అంటూ ముఖ్యమంత్రి కెసి ఆర్ ప్రగల్భాలు పలుకుతున్నాడని విమర్శించారు.  ము ఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్క టీ నెరవేర్చకుండా మాటలతో కాలయాపన చేస్తున్నార న్నారు. రాష్ట్రంలో బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, దళితులకు సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే విశ్వ విద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించి నిధులు విడుదల చేయాలన్నారు.

జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగిన సభలో ఎఐవైఎఫ్ జాతీయ ఉపా ధ్యక్షుడు బి. ఆంజనేయులు మాట్లాడుతూ సంక్షేమ వస తి గృహాల్లో ఉండే పేద విద్యార్థుల పరిస్థితి దయనీయం గా ఉందని, కనీస వసతులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని, తాగునీరు, నాణ్యమైన పౌష్టికాహారం, పరిశుభ్ర త లేక వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. ఈ యాత్రలో తెలం గాణ విశ్వవిద్యాలయాల కార్యదర్శి ఆర్‌ఎం శంకర్, ఎఐ ఎస్‌ఎప్, రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ, ప్రజామండలి రాష్ట్ర అధ్యక్షుడు పల్లె నర్సింహ, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రయ్య,  నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments