Home తాజా వార్తలు నగరంలో జాబ్‌మేళా..!

నగరంలో జాబ్‌మేళా..!

Job-opportunity

హైదరాబాద్: నగరంలోని బిజినెస్ 2 బిజినెస్ పోర్టల్ ట్రేడ్ హైదరబాద్. కామ్ నేత్రృత్వంలో మార్చి 30 న ఈవెంట్ మేనేజ్ మెంట్ అండ్ ఈ కామర్స్ ఉద్యోగ మేళాను ఏర్పాటు చేస్తున్నట్టు ట్రేడ్ హైదరాబాద్ డాట్. కాం సిఒఒ శ్రీలత వెల్లడించారు. ఎలాంటి రుసుము చెల్లించకుండా ఏదైనా డిగ్రీ, ఎంబిఎ పూర్తి చేసిన అభ్యర్థులతో సహా కొత్త అభ్యర్ధులు, ఉద్యోగ అనుభవం ఉన్న అభ్యర్ధులు కూడా ఈ మేళాలో పాలుపంచుకోవచ్చని పేర్కొన్నారు. ఉద్యో గానికి ఎంపికైన అభ్యర్ధులకు రూ. 24 వేల నుం చి 32 వేల వరకు వేతనంతో పాటు టిఎ, డిఎ, బిజినెస్ అలవెన్స్ సదుపాయం కల్పిస్తామని తెలిపారు. మేళాకు రావాలనుకున్న అభ్యర్ధులు 7337556150 ఫోన్ నంబరు కు కాల్ చేసి తమ పేర్లునమోదు చేసుకోవాలని కోరారు.