Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

పోటీ వ్యాపారంతోనే కల్లులో కల్తీ!

గీత కార్మికులే నడిపితే ఈ సమస్యే లేదు
ఒకేసారికి బదులుగా.. క్రమంగా కల్తీని నివారించాలి

mdk2సంగారెడ్డి అర్బన్ : ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కల్లు దుకాణాల్లో కల్తీ జరగ కుండా నిక్కచ్చిగా వ్యవహరించడంతో కల్లుబాబులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సంగారెడ్డి మండల పరిధిలో 27 గ్రామ పంచా యతీలకు సంబంధించి కొంతమంది కాంట్రాక్టర్లు కల్లు ను సరఫరా చేస్తున్నారు. సంగారెడ్డి, సదాశివపేట, మియాపూర్, రంగారెడ్డి, తదితర ప్రాంతాల్లో కల్లును కృత్రిమంగా తయారు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒకరిపై ఒకరు పోటీతో ఎవరికి వారు కల్లు విక్రయాలు పెంచుకోవడానికి మోతాదుకు మించి మత్తునిచ్చే పదార్థాలు వాడడంతో ప్రజలు ఆ మత్తుకు బానిసల య్యారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం కల్తీని అరికట్టాలనే ఉద్దేశ్యంతో ఎక్సైజ్ అధికారులకు దాడులు జరిపి కల్తీని అరికట్టాలని ఆదేశాలు జారీచేసిం ది. దీంతో ఎక్సైజ్ అధికారులు కల్లు డిపోలపై తమ ప్రతాపం ప్రారంభిం చారు. చేసేదిలేక కల్లు తయారీ దారులు ఒక్కసారిగా మత్తునిచ్చే పదార్థాలు కల్లు తయారీలో వాడ కం నివారించారు. దీంతో ప్రజలు మతిభ్రమించినట్టుగా, వింతవింతగా ప్రవర్తిస్తున్నారు. దీంతో వారిని స్థానిక ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స చేయిస్తున్నా రు. ఈ మత్తుమందును ఒకేసారి నివారించడంతోనే ఈ సమస్యలు తల్లెత్తాయని, విడతలవారీగా నివారిస్తే ఈ సమస్యలు రావని వైద్యులు, పలువురు పేర్కొంటున్నారు.
అయితే అదే అదనుగా భావించిన కొందరు పెద్ద పెద్ద కల్లు కాంట్రాక్టర్లు వారు చెబితే వినని వారిపై తమతో మంచిగా ఉండే కొందరు అధికారుల తో దాడులు చేయించి, కల్లు శ్యాంపుల్స్‌ను తీసి కేసులు చేసేలా పురమా యిస్తు న్నారని తెలుస్తోంది. దీంతో చేసేదిలేక చిన్న చిన్న గ్రామాల్లో సొంతంగా దుకాణాలు నడిపించుకునే కల్లుగీతా వృత్తిదారులు భయాం దోళనకు గురవు తున్నారు. అయితే ఈ కల్లులో సొంతంగా తయారు చేసి అమ్ముకునే దగ్గర ఎలాంటి కల్తీ జరగదని, ఇతర కులాలకు చెందిన వారు కాంట్రాక్టులు తీసుకుని లారీల్లో, వ్యాన్లలో సరఫరా చేసేవారు తమ లాభాపేక్షనే ఉద్దేశంగా పనులు చేస్తారు కాబట్టే ఈ కల్తీ జరుగు తోందని పలువురు ప్రజలు పేర్కొం టున్నారు. అయితే పెద్ద కాంట్రా క్టర్లతో తట్టుకోవడం తమ వల్ల కాదని భయ పడి వారికే లీజ్‌కు ఇచ్చి వారు పంపిన కల్లునే అమ్మే దుస్థితిలో కల్లుగీత గౌడ్ లు ఉన్నారు. అ యితే పూర్తిగా నియంత్రించే శాఖవారు, అజమాయిషీ చేసే వారందరు వారికి సన్నిహితంగా ఉంటారు. దీంతో చిన్నచిన్న దుకాణదారు లు చేసేదిలేక వారితో కలిసిపోయి నడవడం అలవాటుగా మారింది. ఇప్పటికైనా ఈ కాంట్రాక్టు వ్యవస్థను రూపుమాపితే నిజమై కల్లుగీతా కార్మి కులు స్వచ్ఛమైన కల్లునే విక్రయిస్తారు. దీంతో ఈ సమస్యలకు చరమగీతం పాడవచ్చని పలువురు ప్రజలు తెలుపుతున్నారు.

Comments

comments