Home జాతీయ వార్తలు ‘బిజినెస్’ విద్యార్థులకు ఆఫర్ల పంట

‘బిజినెస్’ విద్యార్థులకు ఆఫర్ల పంట

besiness-students1న్యూఢిల్లీ : బిజినెస్ స్కూల్ విద్యార్థులకు విపరీతమైన ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ఈ ఏడాది కుప్పలు తెప్ప లుగా భారత్‌లోని బిజినెస్ స్కూళ్లలో చదివే విద్యా ర్థులకు అవకాశాలు వచ్చాయి. ఆఫర్లు సంఖ్య పరంగానే కాకుండా వేతన పరంగా కూడా బాగా పెరగడంతో విద్యార్థుల ఆనందం వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ఈ వేతనాల్లో రెండంకెల పెంపు కనిపించింది. వ్యాపారాల్లో సానుకూల వాతావర ణం పరిశ్రమలు ఆశాజనకంగా ఉండటం నియా మకాల పెంపులో కీలకమయ్యాయి. ఐఐఎం బెంగళూరు, ఐఎంఐ ఢిల్లీ, ఐఐఎం కోజికోడ్‌లు ఈ నియామకాల్లో ముందు వరుసలో ఉన్నాయి. ఐఐ ఎం కోజీకోడ్‌లో మొత్తం 370 ఆఫర్లు రాగా వాటి ల్లో 119 నియామకాలు జరిగాయి. వీరి సగటు వార్షిక వేతనం రూ. 17.1లక్షలు. ఇది గత సంవ త్సరంతో పోల్చుకుంటే 12శాతం ఎక్కువ. దేశీ యంగా వచ్చిన అత్యధిక ఆఫరు మొత్తం రూ.37 లక్షలు కావడం గమనార్హం. ఐఎంఐ ఢిల్లీలో బ్యాంకింగ్, తయారీ రంగం నుంచి, నిత్యావసర వస్తువుల, ఐటీ తదితర రంగాల నుంచి అత్యధిక ఆఫర్లు వచ్చాయి. వీ  వేతనం రూ.14లక్షలుగా ఉంది. అత్యధిక వేతనం రూ.29లక్షలు. ఐఐఎం బెంగళూరులో అత్యధిక ఆఫర్లు కన్సల్టింగ్ సెక్టార్ నుంచి వచ్చాయి. దాదాపు 30శాతం ఆఫర్లు ఈ రంగాల నుంచి వచ్చినవే. ఇక బిజినెస్ స్కూల్స్‌లో నియామకాలకు ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, స్నాప్‌డీల్, ఓలా, ఉబర్, ఫ్లిప్‌కార్ట్ తదితర సంస్థలు వరుస కట్టాయి. వీటితోపాటు పెట్టుబడి సంస్థలు బ్లాక్‌స్టోన్, ఐడీజీ వెంచర్స్ వంటి సంస్థలు కూడా వచ్చాయి.