Home స్కోర్ ఇంగ్లాండ్ జట్టులోకి బట్లర్

ఇంగ్లాండ్ జట్టులోకి బట్లర్

buttlerమొహాలి: మొహాలిలో శనివారం ఆరంభం కానున్న మూడో టెస్ట్‌కు జోస్  బట్లర్‌ను ఇంగ్లాండ్ జట్టు పిలిపించుకుంది. విశాఖపట్నంలో 246 పరుగులతో ఓడిన పర్యాటక ఇంగ్లాండ్ జట్టు 1-0తో టెస్ట్ సిరీస్‌లో వెనుకబడి  ఉంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మిగిలిన టెస్టుల్లో గెలువడమో లేక కనీసం డ్రా చేయడమో చేయాలన్న పట్టుదలతో ఇంగ్లాండ్ జట్టు ఉంది. ఇంగ్లాండ్ జట్టులో ఇప్పుడు కుక్, బెన్ స్టోక్స్ మాత్రమే కొంత మేరకు నిలకడగా ఆడుతున్నారని, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ బట్లర్‌ను జట్టులోకి తీసుకుంటే అతడు విధ్వంసక బ్యాట్స్‌మన్‌గా ఉపయోగపడనున్నాడని,  రెండు ప్రారంభ మ్యాచ్‌లలో కేవలం 18 పరుగులే చేసిన బెన్ డకెట్ స్థానంలో బట్లర్  మొదటిసారి టెస్ట్ మ్యాచ్ ఈ సంవత్సరం ఆడనున్నాడని ఇంగ్లాండ్ కోచ్ ట్రేవర్ బేలిస్ తెలిపారు. ఇప్పటి వరకు బట్లర్ ఆడిన 15 టెస్టుల్లో అతడి సగటు 30 అని కూడా వివరించారు.  26 ఏళ్ల బట్లర్  81 వన్డేల్లో  తన  స్ట్రయిక్ రేట్ 100 బంతులకు 120.29, శతకాలు 4, అర్ధశతకాలు 12 కలిగి ఉన్నాడని తెలిపారు. ఇదిలా ఉండగా కాలికి గాయమైన స్టువర్ట్ బ్రాడ్ స్థానంలో క్రిస్ వోక్స్ మొహాలి టెస్ట్‌లో ఆడబోతున్నాడు.