Home పెద్దపల్లి నైరుతి రాకతో రైతులు పొలం బాట

నైరుతి రాకతో రైతులు పొలం బాట

Buy seeds, fertilizer with investment checks
దుక్కులు దున్నుతున్న రైతులు
బావుల కింద నారుమళ్లు పోసేందుకు ఏర్పాట్లు
పెట్టుబడి చెక్కులతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు
పల్లెల్లో మొదలైన పొలం పనులు

మనతెలంగాణ/పెద్దపల్లి: ఈ నెల 8న ప్రారంభం అయిన మృగశిర కార్తె ఆరంభంతో తెలంగాణను తాకిన నైరుతి రు తుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో పల్లెల్లో పొ లం పనులు మొదలయ్యాయి.గడిచిన ఖరీఫ్ సీజన్ ననుస రించి తిరిగి పత్తి సాగు చేసే రైతులు చేలల్లో ఉన్న పత్తి బో దులను తొలగిస్తుండగా,మొక్కజొన్నతో పాటు ఆరుతడి ప ంటలు వేసే రైతులు దుక్కులు దున్ని నేలను చదును చేస్తు న్నారు. బావుల కింద నీటి సౌలభ్యం ఉన్న రైతులు వరి నా రు మళ్లు పోసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది వ ర్షాలు ఆశించిన మేర కురవక పో వడంతో పెద్దపల్లి జి ల్లాలో అంచనాల మేరకు పంటలు సాగు కాలేదు. ఈ సీజ న్‌లో వర్షాలు ముందస్తుగానే కు రుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేయడంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో 2లక్షల 40వేల ఎకరాల్లో వివిధ ర కాల పంటలు సాగుకానున్నాయని వ్యవసాయ శాఖ అం చనా వేస్తుండగా,లక్షా 35వేల ఎకరాల్లో వరి,80 వేల ఎక రాల్లో పత్తి,20వేల ఎకరాల్లో మొక్కజొన్న,2వేల ఎకరాల్లో కంది,15వందల ఎకరాల్లో పెసర,వెయ్యి ఎకరాల్లో కూరగాయ లు మిగిలిన విస్తీర్ణంలో సోయా, మినుము, ను వ్వు తదితర ఆరుతడి పంటలు సాగు కానున్నాయి.

పెట్టుబడి చెక్కులతో రైతుల్లో ఆనందం
తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ప థకం కింద ఎకరానికి 4వేల చొప్పున ఇచ్చిన చెక్కులతో రైతుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. రైతుబంధు చెక్కులను నగదుగా మార్చుకున్న రైతులు వాటితో ఎరువులు విత్తనాలు కొ నుగో లు చేస్తూ ఖరీఫ్ సాగుకు సన్నద్ధం అవుతున్నా రు.గతంలోపెట్టుబడి కోసం రైతులు రుణాల నిమిత్తం బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఒక్కోసారి అప్పు పుట్టేదికాదు. గత్యంత రం లేని పరిస్థితుల్లో రైతులు ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడంతో వడ్డీకి వడ్డీలు కట్టలేక,ఆశించిన దిగుబడి రాక తిరిగి కొత్త అ ప్పుల కోసం తిరిగే వారు. ఈ సారి పరిస్థితి భి న్నంగా ఉందని ఎరువులు, విత్తనాల వ్యాపారు లే స్వయంగా చెబుతున్నారు.గతంలో ఎరువులు,విత్తనాల అరువు కోసం పడిగాపులు కా సే రైతులు నగదు చెల్లించి కొనుగోలు చేస్తున్నారని అ ంటున్నారు.
రైతుబంధు పథకం వల్ల ఈ ఖరీఫ్‌లో విత్తనాలకు మొదటి విడత ఎరువులకు ఢోకాలేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఖరీఫ్‌కు అన్ని ఏర్పాట్లు
ఖరీఫ్ సీజన్‌లో పెద్దపల్లి జిల్లాలో సాగుకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్ తెలిపారు. ఈ సీజన్‌లో 22వేల టన్నుల యూరియా, 16 వే ల 8వందల టన్నుల డిఎపి కాంప్లెక్స్ 5 వేల 5 వందల టన్నుల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ ఎరువులు అవసరం కానున్నాయని ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను చేస్తున్నట్టు ఆయన తెలిపా రు.అలాగే పెద్దపల్లి జిల్లాకు ప్రభుత్వం 11 వేల 8 వందల 60క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను కేటాయించిందని అందులో 6,700 క్వింటాళ్ల వరి,250 క్వింటాళ్ల మొక్క జొన్న,325క్వింటాళ్ల కంది,350 క్వింటాళ్ల పెసర,80 క్వింటా ళ్ల మినుము,4,155 పచ్చిరొట్ట ఎరువులు ఉ న్నాయని అన్నారు.
ప్రస్తుతం రైతులకు సాగుకవసరమయ్యే ఎరువులు,విత్తనాలు అందుబాటులో ఉంచామ ని,అవసరమయితే మరిన్ని తెప్పించనున్నట్టు ఆయన పేర్కొన్నారు.
                                                                                   -జిల్లా వ్యవసాయాధికారి తిరుమల ప్రసాద్.