Home మహబూబాబాద్ కల్తీనారు అంటకడితే కటకటాలే!

కల్తీనారు అంటకడితే కటకటాలే!

 Buying seeds in nurseries  In Mahabubabd Dist

మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిథి: రైతులకు కల్తీనారు అంటగడితే కటకటాలు లెక్కించాల్సిందే!. ఎదుగుదల లేని మొక్కలు విక్రయించినా అదే గతి తప్పదని తెలంగాణ ఉద్యాన నర్సరీ రిజిష్ర్టేషన్ రూల్ తీసుకువచ్చి ప్రభుత్వం దాని పర్యవేక్షణ బాధ్యతను ఉద్యానశాఖకు అప్పగించింది. ఈ మేరకు ఇబ్బడి ముబ్బడిగా పూలు, పండ్ల మొక్కలు విక్రయాలు, బంతి, మిర్చినారు విక్రయాలు జోరందుకుంటున్న సందర్భంలో ఒకప్పుడు ఉన్న నర్సరీలకు నేడు వందలకు చేరుకున్నాయి. హైబ్రీడ్ మొక్కలని అంటగట్టడం, అవి ఎదుగుదల లేక, పూత, కాత లేకపోవడం నర్సరీ నిర్వాహకులు ఉడాయించడం జరుగుతోంది. దీంతో నిజాయితీగా వ్యవహరించే వారిపై నమ్మకం సన్నగిల్లుతోంది.  ఇకపై ఇటువవంటి సంఘటనలకు తావు లేకుండా ప్రైవేటు నర్సరీలను చట్టపరిధిలోకి తెస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత చట్టానికి సవరణలు చేసి ఉద్యాన శాఖకు పర్యవేక్షణ బా ధ్యతలు అప్పగించింది, నర్సరీల రిజిష్ర్టేషన్ ఇక నుంచి ఉద్యానశాఖ కనుసన్నల్లో కొనసాగనుంది. జిల్లాలో నర్సరీలు మొత్తం ఉద్యానశాఖ పరిధిలోకి చేరుతాయి. తెలంగాణ ప్రభుత్వం నర్సరీ చట్టాన్ని అమలు పర్చడానికి విధివిధానాలను రూపొందించింది, రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రై వేటు రంగాల్లో ఉద్యాన మొక్కలు (పండ్లు, కూరగాయలు, పూలు) పెంచి ఆ మొక్కలతో వ్యాపారం నిర్వ హించే నర్సరీలన్నీ ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

ప్రైవేటు నర్సరీలు చలానా కట్టాలి
కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలు, ఔషద మొక్కల ఉత్పత్తి పరిమాణాన్ని బట్టి నర్సరీ నిర్వాహకులు చటానా కట్టాల్సి ఉంటుంది. 4లక్షల మొక్కల ఉత్పత్తి వరకూ రూ.1,000, 4లక్షల మొక్కలు కంటె ఎక్కువ ఉత్పత్తి అయితే రూ.2,500 చలానా కట్టాల్సి ఉంటుంది.
నర్సరీలో రికార్డులు నిర్వహించాలి
నర్సరీల్లో విత్తనాలు కొనుగోలు రికార్డు, విత్తన కంపె నీ వివరాలు, లాట్ నెంబర్, జర్మినేషన్(మొలక శాతం) విత్తనం ప్యాక్ చేసిన తేదీ, విత్తనం ముగింపు తేది వివరాలు రికార్డులో రాయాలి. అలాగే ప్రొట్రీలలో, కోకోపిట్‌లలో నారుపై పిచికారి చేసిన రసాయనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల వినియోగం వివరాలు తెలిపే రిజిష్టర్ కూడా నిర్వహించారు. నారు ఉత్పత్తి, అమ్మకాల రిజిష్టర్, నర్సరీ తనిఖీ, అధికారి సూచనల రిజిష్టర్ నిర్వహించారు. నారు మడుల్లో విత్తనాల సూచిక( నారు పోసిన తేదీ, విత్తనం రకం, కంపెనీ పేరు) బోర్డు రూపంలో తెలపాలి.
నర్సరీ రిజిషష్ర్టేషన్ ఇలా
నర్సరీ పూర్తి చిరునామా దరఖాస్తు దారుడి ఫోటోతో సహా ఉండాలి. భూమి పత్రలు, పట్టాదారు పాస్ పుస్తకం, లీడ్ అగ్రిమెంట్, లే అవుట్ మ్యాప్, నర్సరీలో ఉన్న వసతులు, భూసార, నీటి నాణ్యత పరీక్ష వివరాలు( ప్రభుత్వ సంస్థ దృవీకరించాలి), చివరి మూడు సంవత్సరాల నర్సరీ మొక్కల ఉత్పత్తి వివరాలతో నర్సరీ రిజిష్ర్టేషన్ చేయించాలి. పక్కా రిజిష్ర్టేషన్ లేకుంటే కఠిన చర్యలు తీసుకునే విధంగా చట్టంలో పొందుపర్చి ఉంది.
నిబంధనలు పాటించకుంటే జైలుకే
నర్సరీ యజమానులు నిబంధనలు పాటించకుంటే చట్ట ప్రకారం రూ.50వేలు జరిమానాతోపాటు ఏడాది జైలు శిక్ష , రెండూ కూడా విధించే విధంగా రూపొందించారు. రైతులు కూడా రిజిష్టర్ నర్సరీల నుంచే నారు కొనుగోలు చేయాలి, బిల్లు తీసుకుని జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి.
నర్సరీలు నిబంధనలు పాటించాలి: ఉద్యానశాఖ అధికారి కె.సూర్యనారాయణ
అనుమతి పొందిన నర్సరీలు నిబంధనలు పాటించాలని, నర్సరీ యజమానులు విత్తనం ఎక్కడ సేకరించారు. బిల్లు వివరాలు, లాట్ నంబర్, బ్యాచ్ నంబర్, విత్తనం పరీక్ష వివరాల పత్రాలు, విత్తనం తయారు చేసిన తేదీ, గడువు తేదీ, విత్తిన తేదీ, నారు మొక్కలు అమ్మిన తేదీ తదితతర వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. నర్సరీ ప్రధాన ద్వారాం వద్ద ఒక బోర్డు ఏర్పాటు చేసి అక్కడ లభించే నారు మొక్కల సంఖ్య, ధరల పట్టిక తెలుగులో రాసి ఉంచాలి, నాణ్యమైన నారు మొక్కల తయారీకి సరైన భూమి ఎన్నుకోవడంతోపాటు చుట్టూ ఫెన్సింగ్ వేయాలి. పిల్ల, తల్లి మొక్కల బ్లాక్‌ను వేరుగా ఉంచాలి. వీటగితోపాటు కార్యా లయం, స్టోర్ వసతులు ఉండాలి,మొలకలు నర్సరీ బెడ్ల తయారీ షెడ్ నెట్ హౌజ్ సమకూర్చుకోవడం తో పాటు అవపకమూర మౌలిక వసతులు కల్పించాలి, నారు వయస్సు, నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక నిబంధనలు రూపొందించినట్లు ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ జిల్లా అధికారి కె. సూర్యనారాయణ తెలిపారు. నర్సరీ రిజిష్ర్టేషన్ విధివిధానాలపై ఈనెల 14న బేతోలులో అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.