Home వార్తలు బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాతగా శర్వానంద్ చిత్రం

బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మాతగా శర్వానంద్ చిత్రం

Sharwanandరన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి సూపర్‌హిట్ చిత్రాలతో హ్యాట్రిక్ సాధించిన శర్వానంద్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా భారీ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భోగవల్లి బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై చంద్రమోహన్ చింతాడ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం గురించి నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ “మా డార్లింగ్ చిత్రానికి అసోసియేట్‌గా పనిచేసిన చంద్రమోహన్ ఒక మంచి సబ్జెక్ట్ చెప్పారు. ఈ సబ్జెక్ట్ విని శర్వానంద్ చాలా ఇంప్రెస్ అయ్యారు. మా అందరికీ ఈ కథ బాగా నచ్చింది. చంద్రమోహన్‌ని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ వెంటనే ఈ సినిమాను ప్రారంభించబోతున్నాం. జూన్ 1 నుంచి నాన్‌స్టాప్‌గా ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. ఈ చిత్రంలో నటించే మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియజేస్తాము”అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతంః రతన్, సినిమాటోగ్రఫీః కార్తీక్ ఘట్టమనేని, లైన్ ప్రొడ్యూసర్‌ః చక్రవర్తి రామచంద్ర.